ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ పై  అక్రమస్తుల కేసులు నమోదు అయినా విషయం తెలిసిందే . ఈ కేసు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిబిఐ  ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్యవారం విచారణకు హాజరవ్వాలి . కాగా సీఎం అవ్వక ముందు సజావుగానే విచారణకి హాజరు అయినప్పటికీ ... తాజాగా కోర్టుకు ఈ కేసు విషయం లో ఓ పిటీషన్ దాఖలు చేసి తన వ్యక్తి గత హాజరును మినహాయించాలని కోర్టుని కోరాడు జగన్.


సీఎం హోదాలో ఉండటం వాళ్ళ ... ఎన్నో అధికారిక కార్యక్రమాలు చెప్పట్టాల్సి ఉంటుందని ... అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవ్వటం వల్ల పరిపాలన దెబ్బ తినే అవకాశం ఉందని తెలిపాడు జగన్ . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా భాగలేని నేపడీమలో ... తాను ప్రతి వారం కోర్టుకు హాజరవ్వటం వల్ల   ప్రొటోకాల్‌ తో పాటు భద్రతకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. తాను ప్రతి వారం కోర్టుకి హాజరవ్వలేనని ... తనకి వ్యక్థజి గత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన తరుపున తన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు హాజరవుతాడని ... దీనికి కోర్టు అనుమతించాలని కోరుతూ కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .కాగా జగన్ సమర్పించిన ఈ పిటీషన్ నేడు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారించనున్నారు .


అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా  పలాసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు .ఈ భారీ బహిరంగ సభను జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ఈ సభ లో పలు శంకు స్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు . తన 100 రోజుల పాలనకు సంబంధించి ఈ సభలో  జగన్ ప్రసంగం ఇవ్వనున్నారు .




మరింత సమాచారం తెలుసుకోండి: