వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విధంగా ప్రతిపక్షాన్ని, ఆ నేతలని విమర్శిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేధికగా ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు అయినప్పటికీ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని సంచలన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పేరును ముద్రించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డాడు.   


విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ 'ఆర్టీసీ కార్మికులకిచ్చిన ఒక్క హామీనీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. ప్రైవేటు ఆపరేటర్లకు కోసం ఆర్టీసీని కొల్లగొట్టారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీ ప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారు. ఆర్టీసీని ఆయన మూసివేత దశకు చేర్చి పోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట నిలుపుకుని ఊపిరి పోశారు.'' అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్యాగ్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ ''సార్ .. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ప్రభుత్వ పనులు చేసినందుకు ధన్యవాదాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అంటూ ఒకరు ట్విట్ చేస్తే మరికొందరు ట్విట్ చేస్తూ 'ఆంధ్ర ఆర్టీసీకి వైఎస్ జగన్ దేవుడు అయ్యాడు' అని ట్విట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల గుండెల్లో దేవుడు అయ్యాడు వైఎస్ జగన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: