టీడీపీ పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల నుంచి టీడీపీలో ఎన్టీఆర్ ప్రస్తావన గురించి చర్చ భారీగా జరుగుతుంది. ఇప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ చాలా అవసరమని నేతలు భావిస్తున్నారు.  ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను అధినేత చంద్రబాబు పసిగట్టిన నేతలను కంట్రోల్ లో పెట్టలేకపోయారు.


చివర్లో డబ్బులతో మ్యానేజ్ చేయొచ్చనుకొని ప్రజలను బాబుగారు చాలా తక్కువ అంచనా వేసినారు. అయితే బాబును ప్రజలు విశ్వసించలేదు. అయితే టీడీపీ ఓటమి .. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పార్టీలోని కొంత మంది నేతలు భహిరంగానే చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. 


అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పై పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేదన్న సంగతీ తెలుస్తుంది. మొన్న బాలయ్య చిన్న అల్లుడు భరత్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ పై వీరికి ఎంత ఈర్ష్య ఉందో .. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఎంట్రీ మీద లోకేష్ స్పదించడం ఆసక్తికరంగా మారింది. లోకేష్ చెబుతూ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని .. ఎన్టీఆర్ కూడా రావొచ్చని ప్రత్యేకంగా వ్యక్తుల కోసం పార్టీ ఉండదని లోకేష్ సెలవిచ్చారు. పార్టీకి ప్రస్తుతం ఎన్టీఆర్ దూరంగా ఉండటం అది తన వ్యక్తిగత అభిప్రాయమని లోకేష్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ .. అధినేత ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకుంటారని  .. లోకేష్ భిన్నంగా సమాధానం చెప్పడంతో .. టీడీపీలో ఎన్టీఆర్ రావొచ్చేమేనని ప్రచారం మొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: