ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్  పై సీబీఐ కోర్టు ఈ నెల 20 వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. ఏపీ సీఎంగా పాలన, అధికార విధుల్లో విశ్రాంతి లేకుండా ఉన్నానని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందువలన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తుంది. జగన్ తరపున న్యాయవాది జి. అశోక్ హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని జగన్ పిటిషన్ లో కోరారు. 
 
ముఖ్యమంత్రి స్థానంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. పరిపాలనకు సమయం కేటాయించాల్సి ఉంది. తరచూ కోర్టు విచారణకు హాజరు కావటం వలన పరిపాలన దెబ్బ తినే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని జగన్ పిటిషన్ లో ప్రస్తావించినట్లు సమాచారం. సీఎం హోదాలో ఉండటంతో కోర్టుకు హాజరు కావాలంటే ప్రోటోకాల్ తో పాటు సెక్యూరిటీ కల్పించటానికి ఖర్చు ఎక్కువగా అవుతుందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. 
 
వ్యక్తిగత హాజరు అవసరం అని కోర్టు భావించిన పక్షంలో తప్పకుండా కోర్టుకు హాజరు అవుతానని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అవసరం లేదని కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు విచారణను 20 వ తేదీకి వాయిదా వేయటంతో 20 వ తేదీన సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. జగన్ అక్రమాస్తుల కేసులో 11 ఛార్జ్ షీట్ల కేసును కూడా సీబీఐ కోర్టు 20 వ తేదీని వాయిదా వేసిందని సమాచారం. ఈ కేసు విషయంలో శ్రీలక్ష్మి, విజయసాయి రెడ్డి ఈరోజు కోర్టుకు హాజరయినట్లు సమాచారం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: