కర్ణాటకలో రాజకీయాలు మారాయి. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ సర్కార్ అధికారం లోకి వచ్చింది. ఇది పాత విషయమే కానీ, జేడీఎస్ నేత మాజీ ప్రధాని దేవగౌడ మాత్రం కొన్నాళ్లుగా విజయవాడ రావాలని అనుకుంటున్నారు. కానీ కుదరటం లేదు. విజయవాడ వచ్చే కనకదుర్గమ్మను దర్శించుకుని ఏపీ సీఎం జగన్ ను కలవాలని అనుకుంటున్నారట. కానీ ముహూర్తం కుదరడం లేదని తెలుస్తోంది.


మాజీ ప్రధాని దేవగౌడ ఏపి సిఎం జగన్ ను కలవాలని అపాయింట్ మెంట్ కోరారని సమాచారం.గత రెండు మూడు నెలలుగా సిఎం ఓ అధికారులకు దేవగౌడ నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఒక్కటే సమాధానం వస్తుంది. సార్ మీరు పెద్ద వాళ్లు మా సారే బెంగుళూరు మిమ్మల్ని కలుస్తారని జగన్ కార్యాలయం నుంచి రిప్లై మెసేజులు వెళుతున్నాయని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు కూడా దేవగౌడ అపాయింట్ మెంట్ కోరారని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆయన్ను కలిసేందుకు టైమ్ ఇచ్చారట.



కానీ జగన్ మాత్రం దేవగౌడ ను అమరావతిలో కలిసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇంతకముందు దేవగౌడ మనుమడు, కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడను జగన్ అమరావతి లోనే కలిశారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు.కానీ ఆయన తాత దేవగౌడ ను కలిసేందుకు మాత్రం జగన్ ఇష్టపడక పోవటానికి రాజకీయ కారణాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జేడీఎస్ అధినేత కుమారస్వామి దేవెగౌడ తో చంద్రబాబు మంతనాలు జరిపారు. తృతీయ ప్రత్యామ్నాయానికి ప్రణాళికలు వేశారు.



చంద్రబాబు తో కలిసి రాజకీయ అడుగులు వేసిన వారితో తమ అధినేత మీటింగ్ కావలసిన అవసరం ఉందా అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇదే సమయంలో దేవగౌడతో మీటింగ్ ఐతే కేంద్రానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్లే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచించిన జగన్ దేవగౌడని కలిసేందుకు ఇష్టపడటం లేదని, అందుకే బెంగుళూరు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారట.


మరింత సమాచారం తెలుసుకోండి: