అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఓ టాపిక్ పై ఫుల్ డిస్కషన్ నడుస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మధ్య అసలు ఏం జరుగుతోంది. శంకర నారాయణ మంత్రి అయ్యి మూడేండ్లయ్యింది. కానీ ఇప్పటి వరకూ మంత్రి పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే అనంత్ పాల్గొనలేదు. ఇదేం పెద్ద వింతకాదు పాల్గొనాలని రూల్ కూడా లేదు. కానీ తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలోనైనా పాల్గొనాలి కదా, అది ప్రొటోకాల్ కూడా. కానీ శంకర్ నారాయణ అటెండ్ అయిన ఏ కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే హాజరు కావడం లేదు.


మంత్రి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలెందుకు రావడం లేదనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అలకకు కారణమేమిటి అని ఒక్కసారి పరిశీలిస్తే అనంత వెంకటరామిరెడ్డి మంత్రి శంకర్ నారాయణ కన్నా చాలా సీనియర్. ఐదు సార్లు ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చూసిన నేతలు, ఓ రకంగా చెప్పాలంటే సీనియర్ పొలిటీషియన్. ఈ సారి మంత్రి అవడం ఖాయమన్న టాక్ జోరుగా వినిపించింది. కానీ సీఎం జగన్ సామాజికవర్గ ఈక్వేషన్స్ లో శంకర్ నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. శంకర్ నారాయణ చాలా సౌమ్యుడు, వివాద రహితుడు అయిదేళ్ల పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.


అన్నిటికీ మించి ఎవరితోనూ విభేదాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ శంకర్ నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే అనంత వెంకట్రామిరెడ్డి ముందర శంకర్ నారాయణ చాలా జూనియర్, అందులోనూ తొలి సారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తనకు వస్తుందనుకున్న మంత్రి పదవి శంకర్ నారాయణకు రావడం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మంత్రి హోదాలో ఎంత సీనియర్ అయినా తాను ఎమ్మెల్యేగా ఒకే కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల వెంకటరామరెడ్డి ఫీలవుతున్నట్లు కొందరు వైసీపీ వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే పైకి ఈ కారణాలు చెబుతున్నారు కానీ, వీరిద్దరి మధ్య ఇంకా ఏదో వైరం ఉందని కొందరు నేతల అనుమానం. ఆ కారణంతోనే అనంత వెంకటరామిరెడ్డి మాదిరి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: