Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:19 pm IST

Menu &Sections

Search

జ‌గ‌న్ పాల‌న‌కు ' వంద ' నాలు... 100 రోజుల్లోనే సంచ‌ల‌నాలు

జ‌గ‌న్ పాల‌న‌కు ' వంద ' నాలు... 100 రోజుల్లోనే సంచ‌ల‌నాలు
జ‌గ‌న్ పాల‌న‌కు ' వంద ' నాలు... 100 రోజుల్లోనే సంచ‌ల‌నాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అనే  నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్నాన‌ని ప్ర‌జ‌ల సాక్షిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసి బాధ్య‌త‌లు తీసుకొని నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ వంద రోజులు సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌నకు జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు.. కాదు కాదు వంద‌నాలు తెలుపుతున్నారు.. 100 రోజుల పాల‌న‌కే జ‌నం ఇంత‌లా పుల‌కించి పోతుంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం వ‌ణుకు పుడుతుంది. కేవ‌లం 100 రోజుల‌కే జ‌గ‌న్ పాల‌న గిట్లా ఉంటే... ఇంకా 1725 రోజుల‌ పాల‌న ఎలా ఉంటుంది అనేది ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైసీపీ నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. ఊరికే ఉండ‌కుండా కేవ‌లం ఆఫీసుకు ప‌రిమితం కాకుండా ప్ర‌జాస‌మస్య‌లను తెలుసుకునేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్న జ‌గ‌న్ ప్ర‌జ‌ల ఎజెండానే త‌న ఎజెండా ప్ర‌క‌టించాడు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల కోసం న‌వ‌ర‌త్నాలు అంటూ ముందుకు వ‌చ్చాడు.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. అధికారం క‌ట్ట‌బెట్టారు.. ఇక ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతోనే సంచ‌ల‌నం దిశ‌గా అడుగులు వేశాడు.


త‌న మంత్రివ‌ర్గం కూర్పులోనే సామాజిక న్యాయం పాటించి ఔరా అనిపించిన జ‌గ‌న్‌... ఇక న‌వ‌ర‌త్నాలు నాకు మార్గ‌నిర్దేశ‌కాలు అంటూ ముందుకు పోయేందుకు అవి దిక్సూచిగా భావించి ముందుకు సాగుతున్నాడు. సీఎం ప‌ద‌వి చేప‌ట్టింది మొద‌లు స‌మీక్ష‌ల పేరుతో, న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేసే క్ర‌మంలో అలుపెర‌గ‌కుండా ప‌నిచేసుకుంటూ పోతూనే ఉన్నాడు. కేవ‌లం వంద రోజుల్లో ఏమి ప‌నులు చేయ‌వ‌చ్చో.. ఏమీ చేయ‌లేరో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఇంకా ఉండ‌కుండా కార్యాచ‌ర‌ణ అమ‌లు దిశ‌గా ముందుకు పోతున్న త‌రుణంలో ప‌ల్లేరు కాయ‌లుగా ప్ర‌తిప‌క్షాలు సూటిపోటి మాట‌ల‌తో గుండెల్లో గుణ‌పాలా మాదిరిగా గుచ్చుతున్నా సంక్షేమ‌మే ధ్యేయ‌మంటూ బాట‌సారిలా సాగిపోతున్నాడు..


ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా అడుగులు వేస్తూనే రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌ర్చుతూ త‌న‌దైన శైలీలో ముందుకు దూసుకుపోతున్నాడు. అరివీర భ‌యంక‌ర‌మైన నేత‌ను నేను అని విర్ర‌వీగే నేత‌ను సైతం ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్ళు తాపిస్తున్నాడు సీఎం జ‌గ‌న్‌. కేవ‌లం 100 రోజుల్లోనే మోములో చెర‌గ‌ని చిరున‌వ్వుతో .. ప్ర‌జ‌ల‌కు నేనున్నాను అనే భ‌రోసా ఇస్తూనే... ప్ర‌తిప‌క్షాల‌పై పాశుప‌తాస్త్రాన్ని సంధిస్తూ త‌నదైన ముద్ర వేసుకుంటూ అభివృద్ధిలో సాగిపోతున్న బాట‌సారి జ‌గ‌న్‌.


ఇప్ప‌టికే పాచిపెంట మండలంలో గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. వీటితో పాటు శ్రీ‌కాకుళం కిడ్ని బాధితుల‌కు కిడ్ని రిసేర్చ్‌, డ‌యాల‌సిస్ సెంట‌ర్‌తో పాటు, 200 ప‌డ‌క‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆస్ప‌త్రిని మంజూరు చేశాడు. ఇక కిడ్ని బాధితుల‌కు నెల‌కు రూ.10వేల ఆర్థిక సహాయం చేయ‌డం, ఇక ఫించ‌న్ ప‌థ‌కాన్ని రూ.2250కు పెంచ‌డం చేశాడు. ఇక గ‌త పాల‌కుల‌కు తోడుకున్నంత ఇసుక అన్న‌ట్లుగా సాగిన అక్ర‌మ ఇసుక దందాకు చెక్ పెడుతూ నూత‌న ఇసుక పాల‌సీని తెచ్చి ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే ఇసుకను అందిస్తున్నాడు.


ఇక మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు దిశ‌గా బెల్ట్‌షాపుల‌ను ఎత్తేస్తూ చ‌ర్య‌లు తీసుకోగా, విడ‌త‌ల వారిగా మ‌ద్యం షాపుల‌ను ఎత్తేస్తూ చ‌ర్య‌లు  తీసుకున్నారు. ఇక ముఖ్య‌మైన స‌మ‌స్య అయిన నిరుద్యోగంను పార‌ద్రోలే క్ర‌మంలో గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌కు జీవం పోస్తున్నాడు. త‌న తండ్రి స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఏర్పాటు చేయాల‌నుకున్న స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు ఊపిరి పోస్తూ ఊరూర ఉద్యోగాల జాత‌ర సాగిస్తున్నాడు. ఇక 60ఏండ్ల రాష్ట్ర చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సాహాసాన్ని జ‌గ‌న్ చేశాడు. అదే ఆర్టీసీని ప్ర‌భుత్వ ప‌రం చేయ‌డం. దీంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపాడు.


ఇక ఆశ వ‌ర్క‌ర్ల జీతాల‌ను అమాంతం రూ.10వేల‌కు పెంచి వారి పాలిట ఆప‌ద్భాంద‌వుడు అయ్యాడు. ఇక ఊరూర మ‌ళ్ళీ 108, 104 వాహానాల మోత మోగించేందుకు సిద్ద‌మయ్యాడంటే జ‌గ‌న్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చేస్తున్న త‌ప‌స్సు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సీఎం జ‌గ‌న్ ఇంకా ప్ర‌జా సంక్షేమం కోసం  ప‌నులు చేస్తూనే మ‌రోవైపు గ‌త పాల‌కులు చేసిన త‌ప్పిదాల‌ను వెలికితీస్తూ, ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్న దొంగ‌ల‌ను ప‌ట్టుకుని ప్ర‌జా వ‌న‌రుల‌ను కాపాడే ప‌నిని త‌ల‌కెత్తుకున్నాడు. పోల‌వరం కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు వ‌రంగా మార‌గా ఇప్పుడు పోల‌వరం అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టెందుకు కంకణం క‌ట్టుకున్నాడు. ఇక రాష్ట్రంకు రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో జిమ్మిక్కులు చేసిన చంద్ర‌బాబు అండ్ కో కు ఇప్పుడు చుక్క‌లు చూపుతున్నాడు.


అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు చేసింది గోరంత‌.. గొప్ప‌లు చెప్పుకోవ‌డం కొండంత అన్నట్లు సాగుతున్న వ్య‌వ‌హారానికి చెక్ పెట్టె కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. ఇక కృష్ణ‌మ్మ‌ను చెర‌బ‌ట్టిన అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉన్న చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపే కార్య‌క్ర‌మంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నాడు.. వీట‌న్నింటికి తోడు జ‌గ‌న్ టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు హింస ర‌చ‌న‌, ధ్వంస వ‌చ‌న కార్య‌క్ర‌మం నిరాఘాటంగా కొన‌సాగించిన అక్ర‌మార్కుల పాలిట సింహ‌స్వ‌ప్నంగా మారి అక్ర‌మార్కుల‌ను బ‌జారుకీడ్చే ప‌నిని సాగిస్తున్నాడు.. ఇలా జ‌గ‌న్ 100 రోజుల పాల‌న సాగిస్తుంటే ప్ర‌జ‌ల జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. జ‌గ‌న్‌కు కేవ‌లం ప్ర‌జ‌లే బ్ర‌హ్మ‌ర‌థం పడుతూ, జేజేలు కొట్ట‌డం లేదు.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను శభాష్ అంటున్నారు. అందుకు నిద‌ర్శ‌నం మాజీ జేడీ, జ‌న‌సేన నేత ల‌క్ష్మీనారాయ‌ణే సాక్ష్యం...  సో జ‌గ‌న్ 100 రోజుల్లోనే ఐదేండ్ల అభివృద్ధిని చూపాడ‌నే టాక్ వినిపిస్తుంది.


ys-jagan-government-hundred-days-completed
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఒక్క ప‌థ‌కానికే 560 కోట్లు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..
ఆరోగ్య శ్రీ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు... వైద్య చ‌రిత్ర‌లోనే రికార్డు
ఆ స్టార్ హీరోయిన్‌కు హీరోయిన్లే కావాల‌ట‌.. వారితోనే అన్ని
ప‌వ‌న్‌ను మ‌నం హీరోను చేయ‌డం ఏంటి... ఆ పార్టీ నేత‌ల ఫైర్‌..!
ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
ఆ ఎన్నికల‌ పేరెత్తితేనే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ ఎందుకు..?
మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం ఎలా ఉంది... హిట్టా... ఫ‌ట్టా..!
ఆ ప‌త్రిక అత్యుత్సాహం.. జ‌గ‌న్‌తో ర‌గ‌డ వెన‌క అస‌లు గుట్టు ఇదే...
టీడీపీలో ఆ ముగ్గురు నేతల అడ్రెస్ ఎక్కడ..!
ప్ర‌మాదం ఒక్క‌టే.,. కానీ, పాలకుల కోణంలోనే తేడా..!
డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
టాలీవుడ్ టాప్ హిట్స్‌: ఫ‌స్ట్ వీక్ బాక్స్ బ‌ద్ద‌లు కొట్టిన సినిమాలు
టీడీపీ ప‌రువు తీస్తోందెవ‌రు...!
' వాల్మీకి ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌రుణ్ టార్గెట్ ఎంతంటే...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ట్రేడ్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌
బ్రేకింగ్‌: టీటీడీ పాల‌క‌మండలి ఖరారు.. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్‌
బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
' కోడెల‌కు బాబు నో అపాయింట్‌మెంట్‌ '
బీజేపీలోకి మాజీ మంత్రి... ఆ పార్టీకి మ‌రో షాక్‌..
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
న‌ల్ల‌మ‌ల‌పై తెలంగాణ అసెంబ్లీలో అదిరే ట్విస్ట్‌...
' కోడెల ' మ‌రణంపైనా రాజ‌కీయాలేనా బాబూ.... ఇదేం పద్ధ‌తో మ‌రి..!
తెలుగు రాజ‌కీయాల‌పై కోడెల మార్క్ ముద్ర‌... టీడీపీలోకి ఎలా వెళ్లారంటే...
సొంతపార్టీనే ఛీ కొట్టడాన్ని కోడెల జీర్ణించుకోలేక పోయారా...?
ఒక‌డు పోయాడు.... నేడు కూడా చావ‌నా.... కోడెల‌కు కుమారుడి బెదిరింపులు
కోడెల‌కు త‌ప్ప‌ని బాబు యూజ్ & త్రో పోటు.. బాబు చేతిలో అవ‌మానాలు..
కోడెల ఇంట్లో నిన్న రాత్రి ఏం జ‌రిగింది.. కొడుకుతో గొడ‌వ వెన‌క‌
బాబుతో కోడెల బంధం.. టీడీపీ హిస్ట‌రీలో ఓ చాప్ట‌ర్‌
కోడెల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం (1982 - 2019 )
గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది... ఎక్క‌డ ఉందంటే...
పాక్ ముక్క‌లు కాక త‌ప్ప‌దా...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.