ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఇసుక విధానం బుధవారం కేబినేట్లో ఆమోదం పొందింది. నూతన ఇసుక విధానం ఆమోదం పొందిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం 70,71,72,73 నాలుగు జీవోలను విడుదల చేయటం జరిగింది. నిన్నటి నుండి నూతన విధానం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఇసుక రవాణా మరియు తవ్వకానికి సంబంధించిన బాధ్యతలను చేపడుతుంది. 
 
ఈ నూతన ఇసుక విధానం ద్వారా ప్రజలకు గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ ధరతోనే ఇసుక లభించనుంది. ఇసుక రీచ్ లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక ధరను 375 రుపాయలుగా నిర్ణయించారు. రవాణా ఖర్చును ఇసుక ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రవాణా ఖర్చును టన్నుకు కిలో మీటర్ కు 4 రుపాయల 90 పైసలుగా నిర్ణయించారు. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి ప్రభుత్వం జీపీఎస్ తప్పనిసరిగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. 
 
 ఇసుక వినియోగదారులకు ఎటువంటి సమాచారం కావాలన్నా, ఇసుక విషయంలో ఏవైనా సమస్యలున్నా అధికారులకు ఫోన్ చేసి ఇసుకకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల మేలు కోసం ప్రభుత్వం ఈ సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. 
 
ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించింది. అనుమతి లేని వాహనాల్లో ఇసుక రవాణా చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 14 మందితో కూడిన కమిటీని నియమించి ఇసుక తవ్వకం, అమ్మకాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఒక క్యూబిక్ మీటర్ కు 60 రుపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 82 ప్రదేశాల్లో పట్టా భూములను గుర్తించినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: