భారతదేశంలో కాశీ యాత్ర చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు.  కాశీకి వెళ్లి అక్కడ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకొని, గంగలో మనకు ఇష్టమైన వాటిని వదిలేసి వస్తే.. దానైపై మమకారం పోతుంది.  మమకారం పోతుందికాబట్టి .. దేవునివైపు దేవుడివైపు అడుగులు వేయడానికి అవకాశం దొరుకుతుంది.  అందుకే అలా గంగలో నచ్చిన వస్తువును వదిలేయాలని అంటారు.  


కాశీ యాత్ర చేస్తే పుణ్యం వస్తుందని ఓ కుటుంబం కాశీకి వెళ్లారు.  ఇంటికి తిరిగి వచ్చే సరికి గోచి మిగల్చకుండా సర్వం దోచేశారు.  షాక్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ చేశారు.  ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. హైదరాబాద్ లో జరిగింది.  హైదరాబాద్ లో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి.  తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోచేస్తున్నారు.  


దోచుకుపోతున్నారు.  ఇంట్లో ఎవరైనా ఉంటె వాళ్ళను చంపేస్తున్నారు.  పోలీసులకు దొరికితే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  అందుకే పోలీసు యంత్రాంగం నిత్యం దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేసమయంలో ఎవరికైనా చెప్పి వెళ్ళమని చెప్తున్నారు. సిటీల్లో కంటే నగర శివారులో ఇలాంటి దొగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  చైన్ స్నాచర్లు నుంచి చెడ్డి గ్యాంగ్ వరకు జరిగే దొంగతనాలు అన్ని నగర శివారులోని జరుగుతున్నాయి.  


పోలీసులు సిసి కెమెరాల సహాయంతో ఎంత  లాభాల లేకుండా పోతున్నది.  రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నా.. కళ్లుగప్పి దొంతగానాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే తమిళనాడులో ఓ వృద్ధ దంపతులపై దొంగలు దాడి చేసి చంపబోతుంటే.. ఆ దొంగలను చాకచక్యంతో  ఎదుర్కొని తరిమికొట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.  ప్రతి చోట ఇలాంటి ధైర్యవంతులు ఉంటారని లేదు.  తెలివిగా వ్యవహారిస్తే.. దొంగలు పడ్డా ఇంటిని కాపాడుకోవచ్చని తెనాలి రామకృష్ణ కథలను బట్టి తెలుస్తుంది.  కాబట్టి భయపడకుండా అలోచించి అడుగులు వేస్తె చాలు.. దొంగలకు మిగిలేది జైలే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: