ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన ముగ్గురు భారతీయ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉండగా మరొకరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. అర్లింగ్టన్ టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతున్న కేదార్ నాథ్, కౌషిక్, అజయ్ యుఎస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఒక్లహామాకు వెళ్లారు. టర్న్ ఫాల్స్ అనే జలపాతంలో ఈతకు దిగి చనిపోయారు. మృతులు నెల్లూరు న్యూ మిలటరీ కాలనీకి చెందిన కేదార్ నాథ్ రెడ్డి ఇక్క మిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి తేజ కౌసిక్ గా గుర్తించారు.



కౌశిక్ స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి కాగా ఉద్యోగరీత్యా ఆయన తండ్రి నెల్లూరులో వుంటున్నారు. కౌశిక్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు ఏడాది క్రితం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో చేరాడు. మంగళవారం సెలవు కావడంతో తన స్నేహితులు కేదార్ నాథ్ తో పాటు కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన అజయ్ కుమార్ తో కలిసి ఓక్లహామాలోని అత్యంత ఎత్తయిన టర్న్ జలపాతం చూసేందుకు వెళ్లారు. అందులో ఈత కొడుతుండగా తేజ కౌషిక్, కేదారనాథ్ మునిగిపోయారు.



దీంతో వారిని రక్షించాలని ఆతృతతో అజయ్ కుమార్ కూడా జలపాతాల్లో దూకగా ఈత రాక ముగ్గురు చనిపోయారు. అజయ్ కర్ణాటక వాసిగా గుర్తించారు. అమెరికాలోని తానా సభ్యులు వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనిగిరి ప్రాంతానికి చెందిన కౌషిక్ అమెరికాలో మృతి చెందాడన్న సమాచారం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌషిక్ యొక్క తండ్రి బ్యాంక్ ఉద్యోగి,  ఉద్యోగ రీత్యా 16 సంవత్సరాలుగా బయట ఊరిలో ఉంటున్నారని, ఈ మద్యే పామూర్లో ఇప్పటివరకూ చేసి నెల్లూర్ కి బదిలీ అయ్యారు అని స్థానికులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: