ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అనగానే సంచలన నిర్ణయాల ముఖ్యమంత్రి అని అంటారు ప్రజలు. అతను తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రతిపక్షాలకె కాదు పక్క రాష్ట్రాల నేతలకు కూడా చమటలు పట్టిస్తాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు వైఎస్ జగన్. 


ఈ నేపథ్యంలోనే 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో గంట శ్రీనివాస్ రావు కీలక అంశాలను ప్రస్తావించారు. గతంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వం తక్షణమే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.


అతను టీడీపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారని, సిట్ దర్యాప్తు చేసినా కొన్ని కారణాల వల్ల ఆ నివేదిక బహిర్గతం కాలేదని లేఖ ద్వారా తెలిపాడు. ఇప్పుడు మీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు విశాఖ జిల్లా డీఆర్సీ మీటింగ్ లో మరో సిట్ ను వేసి దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. కావున తక్షణమే మరో సిట్ ను నియమించి ల్యాండ్ స్కామ్ పై విచారణ చేయాలని కోరుతున్ననని తెలిపారు. 


స్కామ్ లో ఎంతటి వారు ఉన్నా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని దర్యాప్తును వీలైనంత తర్వగా ముగించి నివేదికను ఇచ్చాలా చూడాలని ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో కలుషిత రాజకీయాలుకు స్వస్తి పలికేల చూడాలని కోరారు. అవినీతిని రూపుమాపుతామంటున్న వైసీపీ ప్రభుత్వానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని గంటా శ్రీనివాస్ రావు లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: