వాహనాలపై కులం పేరు ఉంటె జరిమానా.. ఏంటి అని భయపడుతున్నారా ? బయపడకండి. ఇది మన దేశంలో నిబంధనే కానీ మన రాష్ట్రంలో కాదు. దేశవ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమల్లోకి రావడంతో చలానా రేటు పెరిగి మధ్య తరగతి ప్రజలను భయపెడుతున్న ఈ చట్టంతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ మరో కొత్త నిబంధనను తీసుకొచ్చి ప్రజలను భయపెడుతున్నారు స్థానిక పోలీసులు. 


వాహనాలపై కులం, ప్రాంతం, సంస్థలు, హోదాలు లాంటివి ఉండకూడదట, ఇలా ఉండటం వలన సమాజంలో సమానత్వం దెబ్బతింటుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఎవరు కూడా తమ వాహనాలపై కులం పేరు, ప్రాంతం పేరు లాంటివి ముద్రించ వద్దంటూ పోలీస్ శాఖా తెలిపింది. ఇదే విషయంపై పౌర సమాజం కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాసింది. 


ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, రాజస్థాన్ పోలీసులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన వారికి రూ. 1000 చలానా విధించి అదే సొమ్ముతో ఒక బ్రాండెడ్ హెల్మెట్ ను వారికి అందిస్తున్నారు. ఒక విధంగా ఇది ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ మరోవైపు మంచిదే అని అంటున్నారు నెటిజన్లు. 


ఎందుకు అని అనుకుంటున్నారా ? ఇక్కడ కార్లపై కానీ బైక్ ల పై కానీ స్థలం ఉంది అంటే చాలు వారి కులాల పేర్లు, మతాల పేర్లు, ఉరి పేర్లు రాసుకొని తెగ సంబరపడుతారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రాజస్థాన్ పోలీసులు చేసిన పని మన పోలీసులు కూడా చెయ్యాలంటు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఈ కొత్త నిబంధన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుంది ఏమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: