ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించిన  మాల, మాదిగ, రిల్లీ కార్పొరేషన్‌ల ప్రకటన పెద్ద బూటకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. నిన్న సోషల్‌ వెల్ఫేర్‌ ద్వారా తీసిన జీవో నెంబర్‌ 102 ద్వారా ఈ విషయం తేటతెల్లమైందన్నారు. దీని ద్వారా జగన్మోహన్‌రెడ్డి మోసాలకు గురౌతున్నవారిలో ఎస్‌సిలు ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు.   మాదిగ, మాల, రిల్లి కార్పొరేషన్ల ద్వారా ఈ ప్రభుత్వం స్వయంగా ఆ వర్గాలకు రాయితీల ఫలాలు ఇస్తున్నట్లు జీవోలేని ప్రకటనను ముఖ్యమంత్రి చేశారన్నారు. 

ఇది ప్రకటనకే పరిమితం చేసి నిన్న లోపాయికారితనంగా జీవో నెంబర్‌ 102 తీసి దీని ద్వారానే ఉమ్మడిగా కార్పొరేషన్‌కు రాయితీలు కల్పించి లోన్లు ఇవ్వటం జరుగుతుందని ప్రకటించడం బాధాకరమన్నారు. దీని ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు కలిపి బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు ప్రకటించారన్నారు. దీని ద్వారా ఆయా వర్గాలలోని ప్రజలందరికి మేలు జరగదని, ముఖ్యంగా ఎస్‌సిలలో అన్ని కులాలకు న్యాయం జరగాలని తెలుగుదేశం ప్రభుత్వం గతంలో జీవో నెంబర్‌ 25ను తీసి జిల్లా యూనిట్‌గా అన్ని కులాలకు అవకాశాలు అందే విధంగా చేసిందని అయన తెలియజేశారు. 

ఈ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తూ లోపాయికారితనంగా జీవోలు తీస్తుందని 2018-19 సంవత్సరానికిగాను గత ప్రభుత్వం లోన్ల నిమిత్తం ప్రకటన చేసి లబ్దిదారులకు ఇంటర్యూలు చేసి లబ్దిదారుల లిస్టు ప్రకటించి వారి చేత లబ్దిదారుల వాటా కట్టించుకొని ఉన్నారనే విషయాన్ని మరచి ఆ లోన్లన్నింటిని రద్దుల ప్రభుత్వం రద్దు చేసింది. 2018--20 రెండు సంవత్సరాలు కలిపి ఉమ్మడిగా లోన్ల ప్రక్రియ చేపడతామని, దానికి సంబంధించిన విధానాన్ని నిన్న ప్రకటించింది. 


ప్రకటించిన విధానం ప్రకారం గతంలో ఎన్నికైన ఏ లబ్దిదారునికి లోన్లు రావని, ఈ సంవత్సరానికిగాను మాదిగ కార్పొరేషన్‌ ద్వారా లబ్ది జరుగుతుందనే భ్రమలు తొలగిపోయాయని పూర్తిగా అర్థమౌతోంది. ఈ రద్దుల ప్రభుత్వం ఎస్‌సి సంక్షేమాన్ని గర్భంలో చంపేసే విధంగా జీవో నెంబర్‌ 102ను తీసుకొచ్చిందని, కావున ప్రభుత్వం ఈ జీఓను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్యూల ప్రకారం లబ్దిదారులను ప్రకటించిన ప్రకారం లబ్దిదారులకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019-20 సంవత్సరాల నుండి ప్రభుత్వం ప్రకటించిన మాదిగ, మాల, రిల్లీ కార్పొరేషన్ల ప్రకారం ఛైర్మన్లను నియమించి విధి విధానాలు ఖరారు చేసి వారికే బడ్జెట్‌ కేటాయించి, ఆ కార్పొరేషన్‌ ద్వారే రాయితీల పంపిణీ జరగాలని పిల్లి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: