తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పై సర్కారు వెనకడుగు వేయటం లేదు, దీనికి తోడు నిపుణుల కమిటీ కూడా పాత భవనాన్ని కూల్చాల్సి వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది . ప్రస్తుత ఫైర్ సేఫ్టీ మొదలు వీఐపీల భద్రత వరకూ ఏ ఒక్కటీ సరిగా లేవని చెప్పింది కమిటీ కొత్త బిల్లింగ్ కడితేనే అన్ని సెట్ అవుతాయి అంటోంది ప్రభుత్వం . పాత సెక్రటేరియట్ ను కూల్చేసి కొత్తది కట్టాలనే ఫిక్సైంది సర్కార్ . పాత సెక్రటేరియట్ కూల్చివేత పై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తో సీఎం కేసీఆర్ చర్చించారు .

ఇక ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించటానికి వీలు లేకుండా ఉందని రిపోర్టులో చెప్పింది కమిటీ . కాబట్టి సెక్రటేరియట్ కోసం కొత్త భవన నిర్మాణం సరైందని నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ సూచించాయి . పాత సెక్రటేరియట్ లో ఆఫీసులు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయని చెప్పింది మంత్రులూ, అధికారులూ ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లడానికి ఫైళ్లు తీసుకెళ్లడానికి ఎండలు వర్షాలు తదితర కారణాల వల్ల ఇబ్బంది కలుగుతోందని కమిటీ అభిప్రాయపడింది .


ప్రస్తుతం సీఎంవో, మంత్రులూ, అధికారులూ వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారని అత్యంత రహస్య డాక్యుమెంట్ లు ఫైళ్లు వివిధ బ్లాక్ లకు తిప్పాల్సి వస్తోందని దీని వల్ల అధికార రహస్యాలు బహిర్గతం అవుతున్నాయని కమిటీ చెప్పింది . ఒకె బ్లాక్ లో సెక్రటేరియట్ ఉంటే ఫైళ్లు అటూ ఇటూ తిప్పాల్సిన సమస్య తప్పుతుందని అభిప్రాపడింది . సెక్రటేరియట్ కు ఎవరు వచ్చినా ఒకటే ఎంట్రన్స్ నుంచి రావాల్సి వస్తోందని ఇది వీవీఐపీ, వీఐపీలకు భద్రత రీత్యా సరి కాదని కమిటీ చెప్పింది . ప్రస్తుతమున్న భవనాలకు ఎంత ఖర్చు పెట్టినా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల్ని అందుకోవడం సాధ్యంకాదు అని కమిటీ చెప్పింది . ప్రస్తుతం సెక్రటేరియట్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలం లేదని మంత్రులు, ఐఏఎస్, అధికారులు సందర్శకుల వాహనాలు భవనాల చుట్టూ ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తున్నారని కమిటీ చెప్పింది . ఒకె భవనం నిర్మిస్తే ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వల్ల పార్కింగ్ పద్ధతి ప్రకారం చేయడానికి వీలవుతుందని వివరించింది .



ప్రస్తుత భవన సముదాయంలోని ఇ, బి, సి, డి, జి, హెచ్ నార్త్ జె,కె బ్లాకుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఆర్పడానికి అగ్ని మాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పింది . మార్పులు చేసిన ఫైరింజన్ పోయే అవకాశం లేదన్నారు . డి బ్లాక్ లో తప్ప మరి ఏ బ్లాక్ లో కూడా మంటలను ఆర్పే ఏర్పాట్లు లేవని చెప్పింది కమిటీ . ఇప్పుడున్న సెక్రటేరియట్ లో సరైన మీటింగ్ హాల్ భోజన హాలు సందర్శకులు కూర్చోవడానికి ప్రత్యేక గది లేదని చెప్పింది కమిటీ . విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు స్వాగతం చెప్పడానికి సరైన స్థలం కూడా లేదంది . వీవీఐపీ, వీఐపీలకు భద్రత సరిగ్గా లేదని వీవీఐపీ, వీఐపీల అధికారులు సందర్శకులు అందరికీ ఒకె ఎంట్రన్స్, ఒకె ఎగ్జిట్ ఉందని భద్రత రీత్యా ఇది సరి కాదని కమిటీ చెప్పింది .


మరింత సమాచారం తెలుసుకోండి: