న‌లబై ఏండ్ల నా రాజ‌కీయ జీవితం...  నా రాజ‌కీయ ట్రాక్ రికార్డు భార‌త దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ రికార్డు.. కాకుంటే కాలం క‌లిసిరాలేదంతే.. కానీ కాలం క‌లిసోస్తే నా అంత తోపు ఎవ్వ‌డు లేడులే.. ఇప్పుడు ఒచ్చిన స‌ర్కారుకు బ‌లం లేకున్నా.. ఆరాచ‌క పాల‌న చేస్తున్నార‌ని న‌ల‌బై ఎండ్ల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అప‌సోపాలు ప‌డుతుంది.. పాపం నారా గారిని చూస్తే జాలేయ‌క మాన‌దు.. ఆయ‌న మాట‌లింటే న‌లుగురు న‌వ్విపోదురు గాక‌.. నేను చేసేది పాల‌న‌.. ఎవ‌రైనా చేస్తే ఆరాచ‌క పాల‌న‌ట‌.. ఇదేందో.. కొత్త‌గా ఆచార‌క పాల‌న‌... అంటే ఏందో ఎవ్వ‌రికి అంతు చిక్క‌డం లేదు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు కొత్త రాజ‌కీయాల‌కు నిర్వ‌చనం చెప్పిన‌ట్లు ఉన్నారు.


వైసీపీకి క్యాడ‌ర్ అస‌లే లేద‌ట‌.. ఏపీలో ఉన్న క్యాడ‌రంతా టీడీపీదే న‌ట‌.. మ‌రి వైసీపీ ఎలా గెలిచింద‌బ్బా... టీడీపీ క్యాడ‌రంతా వైసీపీకి ఓట్లేసిండ్లా.. అంటే టీడీపీ క్యాడ‌ర్ వైసీపీకి ఓట్లేలా ఎసారబ్బా.. ఇది బాబుగారి రాజ‌కీయ అవ‌గాహ‌న‌... ఇకపోతే  ఏపీ సీఎం జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఓ పెద్ద‌మ‌నిషిలా వ్య‌వ‌హ‌రిస్తూ కేవ‌లం క‌డ‌ప జిల్లాకు మాత్ర‌మే ఫ్యాక్ష‌న్ ప‌రిమితం చేశాడ‌ట‌.. కానీ ఆయ‌న కొడుకు జ‌గ‌న్ మాత్రం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు తొలిసారి శ్రీ‌కారం చుట్టార‌ట‌... ఇదేందో కొత్త‌గా ఇంత‌కాలం వైఎస్ జ‌గ‌న్ ఓ ఫ్యాక్ష‌నిస్టు, అస‌లు ఆయ‌న ఎమ్మెల్యేగానే అక్క‌రకు రాడు.. ఈయ‌న లాంటి వ్య‌క్తి  అసెంబ్లీలో ఉంటే ఏపీ అసెంబ్లీ అంతా చెడిపోతుంది.. అని నిండు స‌భ‌లో బీరాలు ప‌లికిన‌ప్పుడు తెల్వ‌లేదా... లేక నారాకు తెలివి లేదా... జ‌గ‌న్ సీఎం అయినంక‌నే క‌క్ష పూరిత రాజ‌కీయాలకు శ్రీ‌కారం చుట్టాడ‌ట‌.. ఇదేమి వింతో మ‌రి నారావారికే తెలియాలి...


ఇక నారా వారు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ లాంటి సీఎం ను చూడ‌లేద‌ట‌.. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రతీకారం తీర్చుకోవడానికా? తమాషాగా ఉందా? నాపై వ్యక్తిగత కక్ష తీర్చుకునే స్థాయికి దిగజారారు. నాకు రక్షణగా పోలీసులను పంపకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు” అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో అస‌హానం వ్య‌క్తం చేయ‌డం చూస్తుంటే పోలీసుల‌ను ర‌క్ష‌ణ‌గా పంప‌నందుకు ఈ అక్క‌సు అంతా అని తేలిపోయింది.. ఇక వైసీపీకి  క్యాడర్‌ లేదు. కొన్ని పరిస్థితులు కలిసి రావడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాది బలమైన క్యాడర్‌ ఉన్న పార్టీ. దేశంలోనే తొలిసారిగా కార్యకర్తలకు బీమా సౌకర్యం తీసుకొచ్చాం. రాజకీయ కక్షల బాధితుల కోసం పునరావాస నిధి ఏర్పాటు చేశాం. కార్యకర్తల సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకున్నాం” అని చంద్రబాబు పాత‌రాగాన్నే ఆల‌పించాడు...


ఇక చంద్ర‌బాబు నాయుడుకు అస‌లు న‌చ్చ‌ని ఆంశం పోలవరం, అమరావతి కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డం.. అక్క‌డ అవినీతిని బ‌య‌టికి తీయ‌డం.. దీనికి ఆయ‌న ఈ ప్రాజెక్టులపై ఆటలాడుకుంటున్నారని,  కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు రద్దుచేసి పంపేస్తారా?, వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడిదారులెవరూ రార‌ట‌. బహుశా రాచరికంలోనూ ఇంత మొండితనం ఉండదేమో! అంటూ త‌న తాబేదార్ల‌కు కాంట్రాక్టులు పోతున్నాయ‌నే అస‌హానం స్ప‌ష్ట‌మైంది. అంటే చంద్రాలు ఏమి చేస్తే అది క‌రెక్ట్‌.. ఇతరులు చేస్తే మాత్రం కాదు అన్న‌ట్లు ఉంది వ్య‌వ‌హారం.


మరింత సమాచారం తెలుసుకోండి: