వైసీపీ అధికారంలోకి వచ్చి వందరోజులు అయింది. ఓ వైపు పాలన బాగుందని అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన  వస్తోంది. బాగులేదన్న వారు తక్కువగా ఉన్నారు. దీనికి తోడు టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ని అభినందిస్తే మరో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి  మరికాస్తా ముందుకెళ్ళి జగన్ వందరోజుల పాలన అదుర్స్ అంటున్నారు. దీంతో అధినేత చంద్రబాబు గంగవెర్రులెత్తిపోతున్నారు.


జగన్ కి ఫండమెంటల్స్ తెలియవని ఈ రోజు చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటిస్తున్న చంద్రబాబు జగన్ మీద ఘాటైన పదజాలం ఉపయోగించి కామెంట్స్ చేశారు. జగన్ సబ్జెక్ట్ నేర్చుకోవాలని కూడా ఆయన అనడం విశేషం. జగన్ ఏదో అద్రుష్టం కలసివచ్చి గెలిచారు. తప్ప వైసీపీకి దశ, దిశా లేదని కూడా బాబు అనడం విశేషం


వైసీపీకి క్యాడర్ ఏదీ అని బాబు ప్రశ్నించారు.  అదే సమయంలో తన పార్టీకి మంచి క్యాడర్ ఉందని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. పార్టీకి మెరికల్లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారి ద్వారా తాను పార్టీని అధికారంలోకి తేస్తానని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుభవించిన నాయకులే పార్టీని వదలిపోతున్నారని కూడా బాబు అన్నారు.


ఏపీలో జగన్ కి జనం అధికారం ఇచ్చింది కక్ష సాధింపు పాలన చేయడానికా అని చంద్రబాబు ప్రశ్నించారు. నాడు వైఎస్సార్ కడప జిల్లాకే ఫ్రాక్షన్ రాజకీయాలను పరిమితం చేస్తే జగన్ ఏపీ అంతటా విస్తరించారని బాబు ఆరోపించారు. మొత్తానికి వంద రోజుల పాలన హుషారులో జగన్ ఉంటే చంద్రబాబు మాత్రం లేనివి పోనివి ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని అంటున్నారు. ఇదే తీరున బాబు జగన్ మీద జనంలో ప్రచారం చేయాలని కూడా డిసైడ్ అయినట్లుగా ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: