తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గానికి చింత చచ్చినా పులుపు చావలేదు అనుకుంటా...ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఇంకా అధికారంలోని ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. అధికారం కోల్పోయిన అహం తగ్గించుకోలేదు. కింద పడిపోయిన పై చేయి మీదే అనే విధంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇంతకీ అలా ఫీల్ అయ్యే వర్గం ఏదో ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. టీడీపీలో పెత్తనం చెలాయించే కమ్మ సామాజికవర్గమే. గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ వీరు చేసిన పెత్తనం అంతా ఇంతా కాదు.


కీలక పదవుల్లో, పోస్టుల్లో వీరి హవానే. చంద్రబాబు ఏం చేసిన తోపు అంటూ భజన చేసిన బృందం కూడా వీళ్ళే. వీరి వల్ల టీడీపీకి అండగా ఉండే బీసీ వర్గాలు దూరమయ్యాయి. ఇక మిగతా వర్గాలు అయితే వీరి పెత్తనాలకు దండం పెట్టేసి పక్కకు కూడా తప్పుకున్నారు. ఇలా ఐదేళ్లు పార్టీలో హడావిడి చేశారు కాబట్టే టీడీపీకి కులముద్ర అంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.


సరేలే ఓడిపోయారు కదా ఇకనైనా సైలెంట్ గా ఉంటారా అంటే అలా కూడా చేయట్లేదు. ప్రభుత్వం మారిన మేము మారం అనే విధంగా నడుచుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న కమ్మ కార్యకర్తల, నేతలు తీరు అలాగే ఉంది. వీరు ఆ తీరుతోనే తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా అవమానించారు. గణేశ్ మండపానికి వచ్చిన ఆమెని కులం పేరుతో దూషించే వరకు వెళ్లారు.


ఇక వీరి బలుపుకి పెద్ద ఉదాహరణగా గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని ఓ ఫ్లెక్సీ నిలిచింది. వినాయకచవితి సందర్భంగా అక్కడి చౌదరీ కార్యకర్తలు ఓ బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్ లో “ప్రభుత్వం ఎవరిదైనా పరిపాలన మాదే. రాజ్యం ఎవరిదైనా రాజసం మాదే. అధికారం ఎవరిదైనా ఆధిపత్యం మాదే. శాసనం ఎవరిదైనా శాసించేది మేమే… చౌదరి!!” అంటూ స్లోగన్స్ ఉన్నాయి. దీన్ని చూసిన సామాన్య ప్రజలు  వీరి పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వీరి కుల పిచ్చే టీడీపీకి ఇంకా నష్టం కలిగిస్తున్నట్లు ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: