వైకాపా నాయకులు, కార్యకర్తలు మానవ మృగాల్లా సమాజంలో సంచరిస్తూ అకృత్యాలు తలపెడుతున్నారని టీడీపీ నాయకులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజాస్వామ్యంలో చీకటి రోజులు నడుస్తున్నాయని వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజల పై ఇసుక భారం అధికం అయిందని..  ట్రాక్టరు ఇసుక పై రూ.1,000 వరకు అదనం అవుతుందని.. అయినా వందరోజులైనా స్వయానా చిన్నాన్నను చంపినవారిని పట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు ? అని జగన్ ను బాగా టార్గెట్ చేస్తున్నారు. నిజంగానే జగన్ ప్రభుత్వం పాలన సరిగ్గా చేయలేకపోతుందా..?  అధికారాన్ని చేపట్టి 100 రోజులు పూర్తవుతున్నా ఇంకా పాలన గాడిలో పడలేదా..? అసలు ఇంతకీ  ఈ 100 రోజులు జగన్ ఏమి చేశాడు ? ఏమి సాధించాడు ? 


జగన్ పాలన గురించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే..  ఎవరు అవునన్నా.. కాదన్నా..   ఈ 100 రోజుల్లో  జగన్ ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకున్నాడు.   రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్'  ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాడు.  మొదట్లో జగన్ దూకుడు చూసి కొత్తలో అలాగే ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన చాల విలువైనదని చాలసార్లు నిరూపించాడు. అయితే ప్రతిపక్షాలు కావాలనే జగన్ పై కుట్రపరితమైన రాజకీయ ఆరోపణలు  చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారు. కాగా ఇంతకీ  ఈ 100 రోజుల పాలనలో జగన్ తీసుకున్న  కొన్ని కీలకమైన నిర్ణయాలు చూద్దాం. 

1. పిల్లల్ని చదివించే తల్లికి ఏడాదికి 15 వేలు జనవరి 26 నుంచి ఈ పథకం అమలవుతుంది.
2. అంగన్‌వాడి, ఆశావర్కర్లకి ఒకేసారి భారీ జీతాలు పెంపు.  . రైతుభరోసా పథకం ద్వారా 12 వేల 500 రూపాయలను అక్టోబర్ 15 నుంచి ఇవ్వనున్నారు.
 3. గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించి లక్ష పదహారువేలమందికి ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కమిటీని నియమించారు.
4. పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచారు..
5. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశారు.
6. ఈ నెల నుంచే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు..
7. 2 వేల నుంచి 2వేల 250 రూపాయల పింఛన్ల ఫైల్‌ పై మొదటి సంతకం పెట్టి అమలు చేస్తున్నారు.
8. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చారు.


గతంలో  ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదనే చెప్పాలి.  అయినా  జగన్ కి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్న పచ్చ మీడియాలో ఇవ్వన్నీ కనిపించవు.  తమ నాయకులకు అనుగుణంగానే అవి పని చేస్తాయి. అందుకే ఈ మధ్య జగన్ పై ఆరోపణలు ఎక్కువయ్యాయి.         


మరింత సమాచారం తెలుసుకోండి: