జనసేనాని పవన్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన గోదావరి జిల్లాల పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజనకు మొట్టమొదట మద్దతు ఇచ్చిన వ్యక్తి బొత్స అని పాత పాయింట్ ను  కొత్తగా లాగారు. ఆనాడు ఏపీ విడిపోతే తప్పేంటి అంటూ ప్రజల మనసులను ట్యూనప్ చేసి చివరికి విడిపోవడానికి ప్రధాన కారకుడయ్యారంటూ బొత్సను  పాపాల భైరవున్ని చేశేశారు. ఇక బొత్స ఇపుడు రాజధాని మారిస్తే తప్పేంటి అంటున్నారని, అలా ఏదో ఒక రోజు రాజధాని మార్చేస్తారని కూడా  పవన్ అన్నారు.


ఇక్కడితో పవన్ ఆపడంలేదు. రాజధాని నిర్మాణం మొదలైందని, ఈపాటికి ఏడు వేల కోట్ల పనులు జరిగాయని రాజధాని అక్కడ నుంచి మారిస్తే ఆ ఏడు వేల కోట్లు ఎవరు కడతారు, బొత్స ఇంటి నుంచి తీసుకువచ్చి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. బొత్స రాజధాని విషయంలో పదే పదే చెప్పినదే చెప్పి జనాల్లో తప్పుడు అభిప్రాయాన్ని పంపుతున్నారని పవన్ మండిపడ్డారు.


ఇక రాజధాని పైన జగన్ తన మనసులోని మాటను చెప్పాలని కూడా డిమాండ్ చేసారు. ఇప్పటికైనా జగన్ పెదవి విప్పకపోతే బొత్స అభిప్రాయాన్నే తాము కొలమానంగా తీసుకోవాల్సివుంటుందని కూడా పవన్ అంటున్నారు. రాజధానిని తాను మార్చమని ఎపుడూ  అనలేదని, అక్కడ పచ్చదనంతో కూడిన రాజధాని ఉండాలని మాత్రమే కోరుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు.


ఇక ఏపీలో శాంత్రిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అంటున్నారు. పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి దాసోహం అనడం దారుణమని కూడా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వంద రోజుల పాలనపై అధ్యయ‌నానికి ఒక కమిటీని వేశామని ఆ నివేదిక రాగానే ఈ నెల 14న జగన్ సర్కార్ విధానాలపై మాట్లాడుతానని పవన్  ట్విస్ట్ ఇచ్చారు. మరి పవన్ ఏం మాట్లాడుతారన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: