అంతా అనుకున్నట్టుగానే జరిగింది.  చివరి క్షణం వరకు విజయం ఊరిస్తూ వచ్చింది.  ఆర్బిటర్ నుంచి విడిపోయింది. అక్కడి నుంచి దిశను మార్చుకుంది.  అన్ని సవ్యంగా జరిగాయి.  ఫైనల్ టెస్ట్ ను కూడా ల్యాండర్ విక్రమ్ పూర్తి చేసుకుంది.  మెల్లిగా దిగుతూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది.  మరో 2.1 కిలోమీటర్ల దూరం.. చంద్రునిపై లాండింగ్ అయ్యేందుకు అంతా సిద్ధం.. ఏమైందో తెలియదు.. సడెన్ గా ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.  


చాలాసేపు వెయిట్ చేశారు.  కానీ ఫలితం రివర్స్ అయ్యింది.  మాములుగా భూమిపై నుంచి సిగ్నల్స్ పంపడం.. దాన్ని రిసీవ్ చేసుకొని ల్యాండ్ కావడం వంటి వాటికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, ల్యాండర్ కు సొంతంగా విశ్లేషించుకుని అవకాశం కల్పిస్తూ ఆర్టిఫీషియల్ మెమరీని ఇన్ ఫుట్ చేశారు.  చివరి క్షణం వరకు అంతా సవ్యంగా సాగింది.  మరో 2.1 కిలోమీటర్లు వెళ్తే చాలు.. భూమిపై అడుగుపడుతుంది.  


ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు.  విక్రమ్ నుంచి ఆర్బిటర్ కు కూడా ఎలాంటి సంకేతాలు వెళ్ళలేదు.  విక్రమ్ నుంచి స్పేస్ సెంటర్ కు కూడా ఎలాంటి సంకేతాలు అందలేదు.  దీంతో మిషన్ ఫెయిల్ అయినట్టుగా నిర్ధారించారు.  ఏదైనా అద్భుతం జరిగి.. ల్యాండర్ క్షేమంగా ఉందని తిరిగి సంకేతాలు అందితే.. అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు.  


ఎందుకని ఇలా జరిగిందే దానిపై డేటా విశ్లేషిస్తున్నారు.  ప్రయోగం విఫలం అయినంత మాత్రాన తక్కువేమి కాదు.  దక్షిణ ధృవంపైకి అడుగుపెట్టడం సాధ్యం కాలేదు. కానీ, ప్రయత్నం చేసింది.  కొద్దిక్షణాల్లో అడుగుపెట్టే సమయంలో ఇలా జరగడం నిజంగా ఇబ్బందికరమైన అంశంగా చెప్పాలి.  అయితే, అధైర్యం చెందాల్సిన అవసరం లేదని, చాలా గొప్ప మిషన్ ఆపరేట్ చేశారని ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.  ఏ దేశం చేయని సాహసం ఇండియా చేసింది.  ఫెయిల్ అయినా చివరి క్షణం వరకు విజయం కోసం పోరాటం చేసింది.  అంతకంటే ఇంకేం కావాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: