బెంగళూరు ఇస్రో కేంద్రం నుండి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఇస్రో శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతూ చంద్రయాన్ - 2 ప్రయోగం కోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. నిన్న రాత్రి మీరు ఎంతగా బాధపడ్డారో నాకు అర్థమైంది. చంద్రయాన్ - 2 విజయం కోసం మీరు పడిన కృషి మీ కళ్ళలోనే కనిపిస్తోంది. ప్రతి భారతీయుడు మీ పోరాటపటిమతో స్పూర్తిని పొందుతున్నాడు. 
 
ఇస్రో శాస్త్రవేత్తలలోని ఆందోళనను నేను తెలుసుకున్నాను. ఎందుకు ? ఏమిటి ? ఎలా ? అనే దానిపై మీ పరిశోధనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. జాతి గర్వించేలా దేశం కొరకు శాస్త్రవేత్తలు తమ జీవితాలను పణంగా పెట్టారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. మీ అవేదనను నేను అర్థం చేసుకోగలను. మీరు పడిన కష్టం ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. 
 
భరతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేసారు. ఇదెంత మాత్రం వెనుకడుగు కాదు. మన శాస్త్రవేత్తలను చూసి జాతి పొంగిపోతోంది. దేశ విజయం కోసం మీరు తీవ్రంగా శ్రమించారు. ఈ అడ్డంకులు మన బలాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. దేశం అంతా మీకు సంఘీభావం తెలుపుతూ రాత్రంతా మేలుకొని ఉంది. మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు కొనసాగుతాయి. 
 
మనం మరెన్నో లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ముందుముందు మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు వస్తాయి. ప్రతి సందర్భంలోను మన సత్తాను చాటుదాం. భరత మాత తెలెత్తుకునేలా మీ జీవితాన్ని ధారబోశారు. ఇస్రో శాస్త్రవేత్తల కుటుంబాలకు నా సెల్యూట్ అన్నారు మోదీ. దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగినది. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుందని మోదీ ప్రసంగించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: