మానవుల నిత్య జీవితంలో కూల్ డ్రింక్స్ కూడా భాగమైపోయాయి. కొంచెం ఎండ అనిపిస్తే చాలు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు చాలామందే ఉన్నారు. కూల్ డ్రింక్స్ తాగటం వలన ఊబకాయం మరియు మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ ముప్పు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళలోనే ఎక్కువగా వస్తున్నట్లు కొన్ని సర్వేలలో తెలిసింది. ఒక అధ్యయనంలో కూల్ డ్రింక్స్ గురించి షాకింగ్ విషయాలు తెలిసాయి. 
 
సాధారణంగా వ్యాయామాలు చేసే సమయంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళుతుంది. అలాంటి సమయంలో సాధారణంగా నీళ్ళు లేదా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతాము. కానీ ఒక అధ్యయనం ప్రకారం వ్యాయామం చేయక ముందు కానీ వ్యాయామం చేసిన తరువాత కానీ కూల్ డ్రింక్స్ తాగితే మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని తెలుస్తోంది. 
 
సోడాతో కూడిన కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినపుడు శరీరంలో వేడి ఎక్కువగా పెరుగుతుందని, శరీరంలో వేడి పెరిగితే మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని అధ్యయనంలో తేలింది. 12 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు సమాచారం. పరిశోధకులు 12 మందిలో ఆరుగురికి నీళ్ళు మిగతా వారికి సోడాతో పాటు కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిన తరువాత ఇదే రకమైన డ్రింక్ తాగమని చెప్పారు. 
 
సోడాతో కూడిన కూల్ డ్రింక్స్ తాగిన వారిలో 75 శాతం మందికి మూత్రపిండాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు రావటం శాస్త్రవేత్తలు గమనించారు. నీళ్ళు తాగిన వారిలో ఈ సమస్య కేవలం 8 శాతం మందిలో మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. గతంలో మరో అధ్యయనంలో కూల్ డ్రింక్స్ తాగే వారు ముందుగానే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో ముందుగానే మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని బ్రిటన్ కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: