తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముగిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ... కాంగ్రెస్ అధిష్టానం  మాత్రం ఇంకా పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనలోనే ఉన్నారు .ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ పదవి మార్పుకు అధిష్టానం ప్రకటన కూడా చేసింది.ఈ నేపథ్యంలో  తెలంగాణ టైగర్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి కి టీపీసీసీ పదవిని ఇవ్వబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి  . కాగా టీపీసీసీ మార్పు పై అధిష్ఠానం కూడా ప్రకటన చేయటం ... ఇప్పటి వరకు ఎవరికీ కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా, రాహుల్ ..రేవంత్ తో ఢిల్లీకి పిలిపించుకొని మరి మాట్లాడారు . ఇదంతా చూస్తుంటే రేవంత్ కి టీపీసీసీ పదవి కన్ఫార్మ్ అయినట్టే అని అనుకున్నారు అంత. పార్టీ కార్య కర్తలు కూడా అధిష్టానం టీపీసీసీ పదవికి సరైన నాయకున్ని ఎన్నుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు .


 కానీ ఈ విషయం సీనియర్ నేతల చెవిలో పడిందో లేదో ... హుటా హుటీనా ఢిల్లీలో వాలిపోయారు .కేవీపీ చేత  అహ్మద్ పటేల్ కు రాయబారాలు పంపారు ఆ నలుగురు నేతలు .... కానీ పార్టీ కోసం వేరే పార్టీ నాయకులను ఆకర్షించని  సీనియర్ నాయకులైన   ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క లు  ...పార్టీ బాగుకు మాత్రం ఎప్పుడు ఆలోచించలేదని...ఆ విషయం మీకు తెలీదా అని  కేవీపీ పై  మండిపడ్డారట అహ్మద్ పటేల్. 


ఉత్తమ్ కి ఇప్పటికే టీపీసీసీ పదవి కట్టబెట్టినప్పటికీ ... ఉత్తమ్ అసమర్థత వల్ల పార్టీ గోరా పరాజయాన్ని ఎదుర్కొందని... ఇక   భట్టి విక్రమార్క కు  వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, సిఎల్పీ నేతగా ఇలా చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ  సరైన ఫలితాలు రాలేదు కదా... ఒక్క ఎమ్మెల్యే ను కూడా పార్టీ మారకుండా ఆపలేక పోయాడు అన్నారట  అహ్మద్ పటేల్. విహెచ్ కి పార్టీ సీనియర్  నేతగా  గౌరవం ఇవ్వగలం కానీ టీపీసీసీ పదవి మాత్రం ఇవ్వలేమని ...ఏమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిన పొన్నం ప్రభాకర్ కి టీపీసీసీ ఇచ్చే ప్రసక్తే లేదంటూ కేవీపీ కి  క్లాస్ పీకారంట అహ్మద్ పటేల్. ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ...అనంతరం కుంతియాతో సమావేశం అయి టీపీసీసీ మార్పు ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దని తేల్చి చెప్పారట ఈ నలుగురు సీనియర్లు  . టీపీసీసీ మార్పు చేయాలనీ ప్రకటన రావటమే తరువాయి అనుకున్న తరుణంలో ...సీనియర్ల రాయబారం టీపీసీసీ మార్పు అంశాన్ని మళ్ళి మొదటికి తెచ్చింది .


మరింత సమాచారం తెలుసుకోండి: