చంద్రయాన్ 1 మిషన్ ను ఇండియా సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది.  విజయం సాధించింది.  తరువాత ఇండియా 2019 జులై 22 న చంద్రయాన్ 2 ను శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది.  ఈ సెప్టెంబర్ 7 వ తేదీ అర్ధరాత్రి తరువాత సుమారు 1:40 గంటల ప్రాంతంలో చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉన్నది.  అయితే, అక్కడి వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో.. ల్యాండర్ మరో 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అనగా.. సిగ్నల్స్ బ్రేక్ అయ్యాయి.  


సిగ్నల్స్ అందకపోవడానికి కారణాలు రెండు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఒకటి చంద్రయాన్ 2 స్వీయనియంత్రణ కలిగి ఉన్నది కాబట్టి అనువైన ప్లేస్ కోసం వేరే చోట ల్యాండింగ్ అయ్యి ఉండొచ్చు.. రెండోది ల్యాండ్ అయిన తరువాత అక్కడ డస్ట్ ఎక్కువగా ఉన్న కారణంగా సిగ్నల్స్ అందకపోయి ఉండొచ్చు.  ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుందని అలా ఉండాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు.  


ప్రపంచంలోని మూడు మూడు ప్రాంతాల నుంచి సిగ్నల్స్ సేకరిస్తున్నారు. ఆస్ట్రేలియా, క్యాలిఫోర్నియా, యూరప్ లలో ఉన్న డేటా సిగ్నల్స్ సెంటర్స్ కు సిగ్నల్స్ వచ్చాయేమో అని ఆరా తీస్తున్నారు.  ఈ మూడు ప్రాంతాల్లోని ఎక్కడికి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ వచ్చినా వెంటనే అవి ఇస్రో కు చేరిపోతాయి.  ఆర్బిటర్ నుంచి సమాచారం రావాల్సి ఉన్నది.  ఆర్బిటర్ త్వరలోనే ల్యాండర్ కు సంబంధించిన ఫోటోలను తీసి పంపించే అవకాశం ఉన్నది. 


ఇదిలా ఉంటె, చంద్రయాన్ 2 ప్రయోగం ఇచ్చిన స్పూర్తితో ఇండియా గగన్ యాన్ పై దృష్టి సారించబతున్నది.  అనుకున్నట్టుగానే 2022 లో ఇండియా గగన్ యాన్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నది.  ఈ ప్రయోగానికి సంబంధించిన ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రారంభించారు.  గగన్ యాన్ 2 ప్రయోగం విజయవంతమైతే.. అతి త్వరలోనే ఇండియా చంద్రునిమీదకు మనిషిని పంపి అక్కడ ఆవాసానికి కావాల్సిన ఏర్పాట్లను సమీక్షించే అవకాశం ఉన్నది.  గతంలో అమెరికా చంద్రుని దక్షిణ దృవం పైన అడుగుపెట్టాలని చూసి విఫలమైన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: