శిబిరాల మీద శిబిరాలు పోటిగా ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కిపోతోంది. వైసిపి బాధితులతో తాము శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబునాయుడు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసిపి అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఒకటే గోల చేస్తున్నారు.

 

రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వైసిపి అరాచకాలు పెరిగిపోతున్నాయంటు ఆరోపణలతో హెరెత్తించేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే వైసిపి బాధితులంటూ కొందరిని పోగేసి గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేశారు.  అదే సమయంలో శనివారం నాడు గుంటూరులోనే టిడిపి బాధితుల కోసం శిబిరమంటు వైసిపి కూడా హడావుడి మొదలుపెట్టింది.

 

అంటే గుంటూరులోనే రెండు పార్టీలు ఏర్పాటు చేసిన పోటి శిబిరాలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. నిజానికి చంద్రబాబు చెబుతున్నట్లుగా టిడిపి నేతలు, కార్యకర్తలపై తమ నేతలెవరూ ఎక్కడా దాడులు చేయలేదని పల్నాడు ప్రాంతంలోని వైసిపి ఎంఎల్ఏలు చెబుతున్నారు. తమ నేతలు, కార్యకర్తల దాడులతో నష్టపోయిన టిడిపి నేతలెవరో చెప్పాలంటూ సవాలు కూడా విసురుతున్నారు.

 

సరే దాడులు నిజమా ? లేకపోతే చంద్రబాబుది అంతా ఉత్త డ్రామానా అన్న విషయాలు ఎప్పటికీ తేలేవి కావు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే పదిమాటల్లో ఎక్కువ భాగం అబద్ధాలే ఉంటాయని చాలా సార్లే రుజువైంది. కాబట్టే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను జనాలు కూడా అంత సీరియస్ గా తీసుకోవటం లేదు.

 

అదే సమయంలో వైసిపి ఏర్పాటు చేస్తున్న టిడిపి బాధితుల శిబిరానికి మాత్రం అనూహ్య స్పందన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో టిడిపి బాధితులంటే ఎక్కువ భాగం కోడల కుటుంబ బాధితులనే అర్ధం. అసెంబ్లీ స్పీకర్ గా ఐదేళ్ళు కోడెల శివప్రసాద్ అపరమితమైన అధికారాలను అనుభవించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు శివరామ కృష్ణ, కూతురు విజయలక్ష్మి చేయని దందాలు లేవు, అరాచకాలు లేవు. కాబట్టే వైసిపి శిబిరానికి ఎక్కువమంది బాధితులు వచ్చే అవకాశాలున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: