చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. ఎవరైనా ఏ వయసులోనైనా చదువుకోవచ్చు.  ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు.  దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండవు.  అందుకే చాలామంది 50 లేదా 60 ఏళ్ళ వయసులో కూడా చదువుతుంటారు.  చదువుకు దాసోహం అవుతున్నారు. చదువంటే పిచ్చి ఉన్న వ్యక్తులు నిరంతరం చదువుని అలవాటుగా మార్చుకుంటారు.  


అలాంటి వ్యక్తులకు చదువుల తల్లి సరస్వతి కూడా సహాయం చేస్తుంది.  సహాయం చేసింది కదా అని వందేళ్ల వయస్సులో కూడా కాలేజీకి వెళ్తాను.. కుర్రకారులనే డ్యాన్స్ లు చేస్తాను.. ర్యాగింగ్ చేస్తా అంటే ఎలా చెప్పండి.  కుదరదు కదా.  ర్యాగింగ్ విషయం పక్కన పెడితే..ఓ ముసలాయన.. ఆయన్ను ముసలాయన అని అనలేము ఎందుకంటే అయన వయసు 103 ఏళ్ళు.. అందుకే శతాధిక వృద్ధుడు అనాలి.  


ఆయన తన 103 ఏళ్ళ వయసులో కాలేజీకి వెళ్ళాడు.  ఎక్కడో తెలుసా చెన్నై.  చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీ.. దీనికి ఎంతో చరిత్ర ఉన్నది.  అక్టోబర్ 16, 1840 వ సంవత్సరంలో ఈ కాలేజీని స్థాపించారు.  ఎంతోమంది ఈ కాలేజీలో చదువుకున్నారు.  గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న కాలేజీ ఇది.  ఈ కాలేజీకి 103 ఏళ్ళ వయసున్న పార్ధసారధి అనే వ్యక్తి వెళ్ళాడు.  ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.. 


అయన అదే కాలేజీలో 1938-40 మధ్యకాలంలో బిఏ చదివాడు.  మంచి మార్కులతో పాస్ అయ్యాడు.  ఇన్నేళ్ల తరువాత ఓసారి ఆ కాలేజీకి వెళ్లాలనిపించిందట.  అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాలేజీకి వెళ్ళాడు.  అక్కడి వాతావరణాన్ని చూసి ముగ్దుడయ్యాడు.  అప్పట్లో తాను చదువుకున్న వాతావరణాన్ని గుర్తు చేసుకున్నాడు.  అందరితో ఆ విషయాలను పంచుకున్నాడు.  సరదాగా అందరితో గడిపి తిరిగి వచ్చాడు ఆ ముసలాయన.  కాలేజీ యాజమాన్యం ఆ ముసలాయన్ని ఘనంగా సత్కరించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: