ఇస్రో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి.  స్పేస్ సైన్స్ లో సాధించాల్సింది చాలా ఉన్నది.  స్పేస్ అంటేనే తలెత్తుకొని చూడటం అలా తలెత్తి చూస్తేనే ఆకాశం కనిపిస్తుంది.  ఇస్రో అలా ఆకాశం పరుగులు తీస్తూనే ఉండాలి.  ఎన్నో విజయాలు సాధించాలి.  సాధిస్తూనే ఉండాలి.  ఎప్పటికి అధైర్య పడాల్సిన అవసరం లేదు.  ఇది పరాజయ కాదు.  మరో విజయానికి పడిన అడుగు అని ప్రధాని మోడీ శాస్త్రవేత్తల్లో ధైర్యాన్ని నింపారు.  


ప్రధాని మోడీ మాత్రమే కాదు, దేశంలోని ఎందరో నాయకులు, ప్రజాప్రతినిధులు ఇస్రో పట్టుదలను, ఇస్రో ప్రయోగాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.  అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేని చోటుకు చేరుకోవాలని అనుకున్నారని, అందులో భాగంగానే అడుగులు వేశారని నేతలు పేర్కొన్నారు.  ఇక సామాన్యు ప్రజలు సైతం ఇస్రో చేపట్టిన మిషన్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు.  


మిషన్ ఫెయిల్ అనడంలో అర్ధం లేదని.. ఇది ఫెయిల్యూర్ కాదని.. విజయం సాధించడంలో ఇస్రో వేసిన అడుగులని ట్వీట్ చేస్తున్నారు.  కోల్పోయింది కేవలం సంకేతాలనే అని.. నమ్మకాలను కాదని, ఇస్రోపై భారతీయులకు భరోసా ఉందని, ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్నో చేస్తారనే నమ్మకం ఉన్నట్టు ట్వీట్ చేస్తున్నారు.  చిన్నారుల దగ్గరి నుంచి 60 ఏళ్ళ వయసున్న పెద్దవాళ్ళ వరకు ఇస్రో చేసిన ప్రయోగాలను గురించి మెచ్చుకుంటున్నారు.  


సైన్స్ ఛాలెంజ్ తో కూడుకొని ఉంటుంది.  అలాంటి స్పేస్ సైన్స్ లో ఒక్కోసారి అవరోధాలు వస్తుంటాయి.  ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి.. ఇస్రో ఇప్పటికే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.  నాసాకు సైతం సాధ్యం కానీ విజయాలను ఇస్రో సొంతం చేసుకుంది.  ప్రపంచదేశాలు కూడా ఇస్రో దేశాన్ని మెచ్చుకుంటున్నాయి.  ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసి చంద్రునిపై కాలుమోపాలని శాస్త్రవేత్తలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: