ఇపుడీ అంశంతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమరావతిలో ఓ అంతర్జాతీయ ఆసుపత్రి ఏర్పాటుకు యాజమాన్యం ముందుకొస్తే వాళ్ళని చంద్రబాబునాయుడు ముడుపులు డిమాండ్ చేసినట్లు స్వయంగా  యాజమాన్యమే చెప్పటం సంచలనంగా మారింది.

 

చంద్రబాబు హయాంలో పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే పేరుతో చాలా దేశాలు తిరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగనే ఓసారి బ్రిటన్ కూడా వెళ్ళారట. అక్కడ మామూలుగానే అమరావతి గురించి ఈస్ట్ మెన్ కలర్స్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. దాంతో అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టి ఓ అంతర్జాతీయ ఆసుపత్రి ఏర్పాటుకు ఇండో యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్) యాజమాన్యం ముందుకొచ్చింది.

 

తర్వాత ఆ సమావేశంలోనే చంద్రబాబుతో భేటి అయిన యాజమాన్యం ప్రతిపాదనలు కూడా అందచేసింది. తర్వాత అమరావతికి వచ్చిన యాజమాన్యం ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 150 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పటం అందుకు డిపాజిట్ గా యాజమాన్యం రూ. 25 కోట్లు చెల్లించింది.

 

సీన్ కట్ చేస్తే డిపాజిట్ చెల్లించిన దగ్గర నుండి యాజమాన్యం ఫైలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదట. ఎందుకయ్యా అంటే కేటాయించిన 150 ఎకరాల్లో ప్రతీ ఎకరాకు కోటి రూపాయలు కమీషన్ + ఆసుపత్రిలో 25 శాతం వాట డిమాండ్ చేశారట. దాంతో యాజమాన్యానికి మతిపోయింది. తమ షరతులకు అంగీకరిస్తేనే మిగిలిన ప్రాసెస్ పూర్తిచేస్తామని స్పష్టంగా చెప్పటంతో ఇక్కడ లాభం లేదని ఆసుపత్రిని మహారాష్ట్రకు తరలించేశారట.

 

తాము చెల్లించిన 25 కోట్ల రూపాయల డిపాజిట్ తిరిగి వాపసు ఇచ్చేయమని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం స్పందించలేదని ఆసుపత్రి ఎండి,  సీఈవో  అజయ్ రంజన్ గుప్త ఆరోపించారు. అయితే తనను కమీషన్ + వాటా అడిగింది ఎవరనే విషయాన్ని మాత్రం రంజన్ నేరుగా చెప్పలేదు. కానీ రంజన్ ఆరోపణలు చూస్తుంటే ప్రభుత్వంలో కీలకస్ధానంలో ఉన్న వారే డిమాండ్ చేసినట్లు అర్ధమైపోతోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: