దేశంలోని ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్ కు చాలా మంచి పేరుంది.నచ్చిన వస్తువుల్ని అమెజాన్ ద్వారా ఆన్ లైన్లో కొనుక్కోవచ్చు. ఇకముందు అమెజాన్ ఉత్పత్తులు ఆన్ లైన్లోనే కాదు ఆఫ్ లైన్లో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఆఫ్ లైన్ దుకాణాలను ప్రారంభించాలని అమెజాన్ సంస్థ ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ ఆఫ్ లైన్ స్టోర్లను ప్రారంభిస్తే అమెజాన్ ఉత్పత్తులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్లో కూడా అందుబాటులోకి వస్తాయి. 
 
ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ కావటం కోసం అమెజాన్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ఇప్పటికే మోర్, షాపర్స్ స్టాప్, ఫ్యూచర్ రిటైల్ తో ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొదట అమెజాన్ సొంత బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించాలని అనుకొంటుందని సమాచారం. అమెజాన్ బేసిక్స్ పేరుతో తయారయ్యే ఉత్పత్తులను మోర్, షాపర్స్ స్టాప్, ఫ్యూచర్ రిటైల్ కు చెందిన 2,000 కంటే ఎక్కువ దుకాణాల్లో విక్రయానికి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ఏసీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, బ్యాటరీలు, డిన్నర్ ప్లేట్లు, బ్యాగులు, గొడుగులు ఇతర ఉత్పత్తులను అమెజాన్ బేసిక్స్ పేరుతో అమెజాన్ సంస్థ విక్రయిస్తోంది. ఆకర్షణీయమైన ధరలకు అమెజాన్ ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు నెలలో ఫ్యూచర్ రిటైల్ లోని ఫ్యూచర్ కూపన్స్ లో అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. సంవత్సరం క్రితం మోర్ రిటైల్ ను కూడా అమెజాన్ కొనుగోలు చేసింది. 


ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్లో కూడా ఉత్పత్తులను విక్రయించటం ద్వారా భారీ ఎత్తున వినియోగదారులను చేరుకునే అవకాశం ఉందని అమెజాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫ్ లైన్లో భారీగా విస్తరించి పేరు తెచ్చుకున్న రిలయన్స్ త్వరలో ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: