మనం వేసే ప్రతి మెట్టులో ఓటమి పలకరించాలని చూస్తుంది.కాని దృడమైన సంకల్పం కూడా ఓటమిని,ఓటమిపాలు చేస్తుంది. ఒక్కడుగుతోనే ప్రయాణం ఆగితే మానవుడు ఈనాడు ఇంతగా అభివృద్ధి చెందేవాడు కాదనిపిస్తుంది.ఎందుకంటే మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు.ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ,శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు.అందులో కొన్ని కొన్నితీపి గుర్తులను మిగిలిస్తే.మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగుల్చుతున్నాయి.అయితే ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంలో కూడా ఆధ్యాంతం విజయం సాధిస్తుందను కున్నవేళ చిట్ట చివరి క్షణం ఇస్రో శాస్త్రవేత్తలనే కాదు, యావత్ భారత ప్రజలను ఆవేదనకు గురిచేసింది.కాని ఇది ఆవేదన చెందే సమయంకాదు.ఆలోచించే సమయమని గుర్తుంచుకోవాలి.



యుద్ధంలో సైనికుడు తన ప్రాణాలు పోతున్న తనతో పాటు నలుగురినైన తీసుకెళ్లాలనే తపనతో కొనవూపిరితోనైన చివరి వరకు పోరాడుతాడు.అది భరతమాత ముద్దుబిడ్డ సత్తా.ఇప్పుడు అదే గుర్తుంచుకోవాలి.మనభరతమాత ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూనే వుంటుంది.ఎందుకంటే భారతీయుల సత్తాను ప్రపంచం చిన్నగా అంచనవేసుకున్న, తన బిడ్దల బలమేంటో తనకు తెలుసు.ఆ ధైర్యమే ఎన్ని ఓటమిలు మన గడప తొక్కిన,ఎన్ని ప్రాణాలు దేశం కోసం బలైనా చిరునవ్వుతో విజయం వైపు సాగడమే భారతీయులకున్న బలం.



ఈ గుణం ఈ మట్టిలో పుట్టిన ప్రతివారి స్వంతం.అందుకే  దేశం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఇంతగా కృషిచేస్తున్నారు.వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిది..భారతమాత కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ఎన్నో త్యాగాలు మరవలేనివి,అందుకే వారి కుటుంబాలకు దేశం సెల్యూట్‌ చేస్తుంది.ఇక చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారు.వారి కృషి ఎప్పటికీ వమ్ము కాదు. ఎందుకంటే వారి వెనకే కోట్లాది మంది భారతీయులు మద్దతు ఉంది.ఈ సమయంలో రావలసింది కన్నీరు కాదు కసి అదే మరోసారి ఇలాంటి అనుభవాన్ని కత్తిలా నరికేస్తుంది..వెనకున్న ఓటమిని గుర్తుంచుకుంటే ముందున్న విజయం చేజారి పోతుంది.అందుకే ఇది ఒక అనుభవం.మరో ప్రయోగానికి శ్రీకారం..ఆల్ ది బెస్ట్....

మరింత సమాచారం తెలుసుకోండి: