యాదాద్రి ఆలయం ప్రాకారాల పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం తో పాటు,  అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు ఉండడం పెద్ద దుమారాన్నే  రేపుతోంది.  తక్షణమే ఆలయ ప్రాకారాల పై కేసీఆర్ చిత్రంతోపాటు కారు గుర్తు ను తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తూ , ఆందోళనకు దిగుతున్నాయి . హైందవ  సంఘాలు ఒక అడుగు ముందుకు వేసి హిందువుల మనోభావాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అడ్డుకుంటున్నారని దుమ్మెత్తి పోస్తున్నాయి.  ఈ నేపథ్యంలో వై టి డి ఏ ఉపాధ్యక్షుడు కిషన్ రావు ,  ఆర్ట్ డైరెక్టర్ కమ్ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ,  స్థపతి డాక్టర్ ఆనంద చారి వేలు మీడియా తో  మాట్లాడుతూ ఆలయ ప్రాకారాల పై ముఖ్యమంత్రి బొమ్మ ఉండటం తప్పేమీ కాదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.


 ఆలయ ప్రాకారాల పై కెసిఆర్ చిత్రంతోపాటు కారు గుర్తు చిత్రం ఉండడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కిషన్ రావు ,  ఆనంద్ స్థాయి ఆనంద చారి వేలు తమ తప్పును సమర్ధించుకునే ప్రయత్నం లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా అనిపించింది.  ఆలయ ప్రాకారాల పై సైకిల్ రిక్షా గుర్రపు జట్కాబండి బొమ్మలతో పాటు సైకిల్ ను కూడా చెక్కినట్లు  చెప్పుకొచ్చారు.  దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం మీడియాకు చూపించక పోవడం గమనార్హం . కారు బొమ్మలు తప్పుపడుతున్న వారిపై విరుచుకు పడే రీతిలో తాము కమలం బొమ్మను కూడా ఆలయ ప్రాకారాలపై చెక్కామని అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.


  కేసీఆర్ బొమ్మను తమకు తాముగా చెక్కామని  అంతే కానీ ఎవరి నుండి ఆదేశాలు అందలేదని చెప్పుకొచ్చారు.  యాదాద్రి ఆలయ నిర్మాణ పని  ప్రతి అంశాన్ని కెసిఆర్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అయన   అనుమతి మేరకు పనులు జరుగుతున్న నేపథ్యంలో శిల్పులు తమ ఇష్టారీతిన కేసీఆర్ బొమ్మను ఆలయ ప్రాకారాల పై చెక్కారంటే  నమ్మశక్యం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: