త‌ల్లీ కూతుళ్లు పోటీ ప‌డుతూ ఒకే ఏడాది ప‌రీక్ష‌లు రాసి  ఉత్తీర్ణత సాధించి విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఇది నిజంగా గ‌ర్వించాల్సిన విష‌య‌మే. చాలా చిన్న వ‌య‌సులోనే ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి చైల్డ్‌ డవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా ఎంపికైన ఘ‌న‌త కూతురుదైతే.. పెళ్తైన 12 ఏళ్ల త‌ర్వాత తిరిగి చ‌దువు ప్రారంభించి  ఏకంగా లెక్చరర్‌ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిద‌ని చెప్పాలి. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లా మంథని దగ్గరి రామకృష్ణాపూర్‌కు చెందిన తల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్‌ సక్సెస్ స్టోరీ ఇది.


రౌతు ప‌ద్మ పెళ్త‌యిన 12 ఏళ్ల త‌ర్వాత భ‌ర్త రమేశ్ ప్రోత్సాహంతో చ‌దువును కొన‌సాగించింది. అలా స్టాట్ చేసి  డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్‌ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్‌ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్‌ పీఎస్‌సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించింది.


ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్‌ డవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా చిన్న వ‌య‌స్సులోనే బాధ్యతలు నిర్వహిస్తోంది. వాస్త‌వానికి త‌ల్లీ కుతుళ్లు ఇద్ద‌రికీ ఒకే జిల్లాలో పోస్టింగ్‌ రావడం ఆశ్చ‌ర్యం. ఇక వీరు ఇంట్లో మంచి ఫ్రెండ్స్‌గా ఉంటార‌ట‌. ప్ర‌తి విష‌యం షేర్ చేసుకుంటార‌ట‌. చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్‌ ఆర్డర్‌లో రూపొందించుకున్న టైమ్‌ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటామ‌ని అలేఖ్య తెలిపింది.


అలాగే వారి విష‌యం వెనక అలేఖ్య తండ్రి ,పద్మ భర్త రౌతు ర‌మేష్ పాత్ర ముఖ్య‌మైన‌ద‌ని వారు చెప్పారు. భార్య మనస్తత్వాన్ని తెలుసుకుని అటు భార్య‌ను.. ఇటు కూతురును ప్రోత్స‌హించ‌డంలో ర‌మేష్‌ ఎలాంటి రాజీ ప‌డలేద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో మాకు వ‌చ్చిన క్రెడిట్ మొత్తం ఆయ‌న‌కే సొంత‌మ‌ని ప‌ద్మ మ‌రియు అలేఖ్య స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: