ఏపీ సీఎం జగన్ 100 రోజుల పాలనలను తుగ్లక్ పాలనతో పోల్చారు ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేశ్. తుగ్లక్ 2.0 @100 డేస్.. తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్.. సంక్షేమం డల్... అమరావతిని ఎడారి చేసారు.. పొలవరాన్ని మంగళ వారంగా మార్చారు..900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు... ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు.


ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు... ప్రజలకు,కార్మికులకు పని ,తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్ల లో నిలబెట్టారు.. ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా ! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే !! అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు నారా లోకేశ్.


జగన్ 100 రోజుల పాలనను పురస్కరించుకుని.. 100 రోజుల జగన్ తుగ్లక్ పాలన అంటూ టీడీపీ నాయకులు బ్రోచర్ విడుదల చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు అంటూ 4 పేజీల బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, యనమల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్ బాబు, అఖిల ప్రియ, జవహర్, డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.


సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... తుగ్లక్ పరిపాలన అని ప్రజల్లో ముద్రపడిపోయింది.. 100రోజుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు..ప్రతిపక్షాల మీద కక్ష సాదింపే లక్ష్యంగా ఈ సీఎం ముందుకు వెళ్తున్నారు.. వ్యక్తిగత రాబడి 3శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉంది.. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది..ఉన్న పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.. మన ఆదాయం తగ్గి తెలంగాణ ఆదాయం పెరుగుతోంది.. వీటన్నింటికీ జగన్ బాధ్యత తీసుకోవాలి.. మొత్తం గా వంచన ప్రభుత్వం తప్ప మరొకటి కాదు.. ఇప్పుడు విడుదల చేసింది మొదటి ఛార్జ్ షీట్ మాత్రమే.. త్వరలోనే మరొకటి విడుదల చేస్తాం.. అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: