బిగ్ బాస్ సీజన్ ౩ లోకి శిల్పా ప్రవేశించింది. ఎలిమినేషన్స్ ఎత్తేయగా కాస్త ఆలస్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా శిల్పా చక్రవర్తి ఎంటరైంది. పలువురు హీరోయిన్ లను సంప్రదించినా కానీ వైల్డ్ కార్డుగా వచ్చేందుకు వారంతా భారీ పారితోషికం డిమాండ్ చేయటంతో టేక్స్ టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తికి అవకాశం దక్కింది. ఈమె ఎంట్రీతో హౌస్ లో ఏం మార్పులు వస్తాయి అనేది చూడాలి. జాన్సీ ఇంకా ఫీల్డ్ లో రాణిస్తున్నప్పటికీ ఎప్పుడో తెరమరుగైన శిల్పా చక్రవర్తికి వైల్డ్ కార్డు ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌస్కి పిలవడం ప్రత్యేకత. ఇలా మొత్తానికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా చక్రవర్తి ఎంటరైంది. మోడలింగ్ నుంచి టీవీ సీరియల్స్ లో నటిస్తూ, యాంకరింగ్ చేస్తూ ఫేమస్ అయ్యింది. పలు సినీ కార్యక్రమాలకు హోస్ట్ గా పాపులారిటీ సంపాదించింది. బెంగాలీ మాతృ భాష అయిన తెలుగులో అనర్గళంగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత.




ఆసక్తికరంగా సాగుతున్న ఈ షోలో ప్రస్తుతం పన్నెండు మంది సభ్యులు ఇంటిలో ఉన్నారు. చాలా రోజుల నుండి తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయం ఉన్న శిల్పా చక్రవర్తి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. ఇప్పటికే రకరకాల గొడవలు జట్టులతో కొనసాగుతున్న బిగ్ బాస్ ఇంట్లో శిల్పా చక్రవర్తి ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి. శిల్పా రావటమే హౌస్ మేట్స్ అందరికీ భలే షాకిచ్చింది. కన్ ఫెషన్ రూములోకి ఇద్దరేసి హౌస్ మేట్స్ ని పిలిపించి, వారికి అక్కడ ఒక మానిటర్ లో చీకట్లో కనిపించిన లైట్ ఎఫెక్ట్ లో ఒక మిస్టరీ ఫ్రెండ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ దర్శనమిచ్చింది. నిజంగానే శిల్పని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. సీనియర్ యాంకర్స్ గా ఉన్న వారికి కొంత కాలం క్రితం పోటీ ఇచ్చినా యాంకర్ గా శిల్పా చక్రవర్తి కనిపిస్తారు. గలగలా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను ఆమె ఆకట్టుకున్నారు. అలాంటి శిల్పా చక్రవర్తి తన కెరియర్ గురించి ఎన్నో చెప్పారు.



యాంకరింగ్ చేసేటప్పుడు, సీరియల్స్ లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను మాది మధ్య తరగతి కుటుంబం మా నాన్న గారికీ స్కూటర్ కూడా లేదు. కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. టీవీలో కనిపించడం మొదలైన తరువాత బస్ లో వెళ్ళిరావడం ఇబ్బందైంది. అది గమనించిన మా అన్నయ్య కూడా బాధపడ్డాడు. మోపెడ్ కొనాలంటే నలభై వేలు ఉండేది. నాకు వచ్చే రెమ్యునరేషన్ అయిదు వందల రూపాయలు. ఇప్పుడు వచ్చిన యాంకర్స్ కి ముప్పై నుండి నలభై వేలు ఇస్తారట. అప్పట్లో మాకు వచ్చేదానికంటే మా చేతి నుంచి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండేది అని చెప్పుకొచ్చారు. శిల్పా చక్రవర్తి రియల్ స్టోరీ ఎంతో ఆసక్తికరం. బెంగాలీ అమ్మాయి అయినా ఈమె తెలంగాణ కూడలిగా మారింది. పుట్టింది బెంగాల్ లో అయినా పెరిగింది, ఎదిగింది అంతా భాగ్యనగరిలోనే.



అసలు చక్రవర్తి అటు వెండితెర పై బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన అందాల తార. పంతొమ్మిది వందల తొంభై ఐదు మే పదిహేను న ఆమె జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ రైల్వే ఉద్యోగులు. బెంగాలీ కుటుంబానికి చెందిన వీరు ఇక్కడ స్థిరపడాల్సి వచ్చింది. తార్నాక రైల్వే క్వార్టర్స్ లో ఆమె బాల్యం గడిచిపోయింది. అక్కడే ఆమె ప్రాథమిక విద్య కూడా పూర్తి చేసింది. ఆ తరువాత రైల్వే కాలేజీలో విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా ప్రవేశించింది. భాష రాక కెరియర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డారు. క్రమేపీ నేర్చుకొని అందరికన్నా ముందడుగు వేసింది శిల్పా. ఆమె మంచి కథక్ డ్యాన్సర్ కూడా, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఒకసారి పవన్ ఆడియో ఫంక్షన్ లో ఆమెకు తీవ్రమైన అవమానం ఎదురైంది.



వ్యతిరేకత వచ్చి ఒక దశలో మద్యలోనే దించేశారు. తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆమె డ్యాన్స్ చేయలేదనుకోండి. ఒక్క డాన్స్ లోనే కాకుండా చక్రవర్తికి స్పోర్ట్స్ లో కూడా మంచి అనుభవం ఉంది. వాటిలో పాల్గొని బహుమతులు ఎన్నో పొందారు శిల్పా. కంటే కూతుర్నే కను సీరియల్ లో ఆమె అభిమానులు ఇప్పటికీ మరచిపోలేరు. అందులో ఆమె చేసిన పాత్ర చాలా మంచి బ్రేక్ ఇచ్చింది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లో తన సత్తా ఏమిటో నిరూపించింది. ఎన్నో కార్యక్రమాలను సమర్పించింది. ఆమె బాల్యమంతా ఒక రకంగా హైదరాబాద్ లోనే సాగిపోయింది. కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు కూడా భాష రాక ఇబ్బందులు పడేది. కాలక్రమేణా అవి అధిగమిస్తూ ముందడుగు వేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి ఫంక్షన్ లో ఓ రకంగా ఉండే తీవ్రమైన అవమానం ఎదురైంది. ఆమె డ్యాన్స్ వద్దు వద్దు అంటూ మధ్యలోనే ఆపేశారు. ఇది అవి మరువలేని అనుభవంగా చెబుతారు.




ఇక ఆమె భర్త కల్యాణ్ వరంగల్ జిల్లాకు చెందిన సినిమా జర్నలిస్ట్. వృత్తిరిత్యా ఓసారి అతను కలిసినప్పుడు తన తల్లి ముందు ఆమెని బయటకు రమ్మని పిలిచాడు. దాంతో ఇలాంటివి తనకు పడవని అతడిని అక్కడి నుంచి అసహ్యించుకోవడం మొదలు పెట్టింది. ఆ తరువాత అసహ్యం పెరిగిపోయింది కూడా కాలక్రమంలో అతని మంచితనం గ్రహించింది. అతడి ఇప్పించిన అవకాశాలు పెరిగి వాళ్ళ ప్రేమ బలపడింది. ఆ తరువాత వివాహం జరిగి ఏళ్లు దాటిపోయింది. భర్త యాకయ్య కల్యాణ్ వరంగల్ జిల్లాకు చెందినవాడు. పెళ్లి తర్వాత శిల్ప అయిదేళ్లు చిత్ర పరిశ్రమలో వివిధ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు నీల్ క్రిష్, అమ్మాయి పేరు అనిత. చిత్ర పరిశ్రమలో పని చేసింది. చాలా చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేసింది. మళ్లీ ఇలా బిగ్ బాస్ లో ఆమె ప్రవేశించడం ఓ రకంగా మంచి కమింగ్ అప్ గా ఆమె అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: