మనం సాధారణంగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా నేరం జరిగితే నేరం గురించి ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు వెళతాం. ఒకవేళ సమస్య పోలీస్ తోనే ఐతే ఫిర్యాదు చేయటానికి ఉన్నతాధికారుల్ని కలవాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల్ని కలవటం అంత తేలికైన విషయం కాదు. కొన్ని సందర్భాలలో ఉన్నతాధికారుల్ని కలవటానికి చాలా రోజులు పట్టే అవకాశం కూడా ఉంటుంది. 
 
కానీ హ్యాక్ ఐ యాప్ స్మార్ట్ ఫోన్లో ఉంటే మాత్రం ఉన్నతాధికారులకు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు అధికారులు ఎవరైనా ప్రజలను ఇబ్బందులు పెట్టినా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో నిమిషాల్లో ఈ యాప్ ఉపయోగించి ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో పోలీసులు నిబంధనలకు విరుధ్ధంగా వ్యవహరించారని, పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించటం లేదని వార్తలు వింటూ ఉంటాం. 
 
కొన్న సందర్భాలలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. ఫిర్యాదు చేయటం కొరకు హ్యాక్ ఐ యాప్ లో వయొలేషన్ బై పోలీస్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఉన్నతాధికారులు ప్రజలను సమస్యలకు గురిచేసే పోలీసులపై ఫిర్యాదు చేయటానికి ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. 
 
పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని పక్షంలో, దురుసుగా ప్రవర్తించిన సందర్భంలో, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయటానికి తిరస్కరించిన పక్షంలో, ఫిర్యాదు తీసుకోని పక్షంలో, అసభ్యంగా ప్రవర్తించిన పక్షంలో, పోలీసుల నుండి సరైన స్పందన లేని పక్షంలో ఇతర విషయాల గురించి ఈ యాప్ ఉపయోగించి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.ఈ యాప్ ఉపయోగించి ఫోటోలు, వీడియోలతో కూడా ఆధారాలను కూడా జత చేయవచ్చు. ఫిర్యాదు చేసిన బాధితులకు ఉన్నతాధికారులు తక్కువ సమయంలో ఫిర్యాదు పరిష్కారం అయ్యేలా చూస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: