నీటి సంకేతాల కోసం వెతకడానికి  చంద్రుని దక్షిణ ధ్రువానికి పంపిన  ల్యాండర్‌ మరియు రోవర్ తో  సంబంధాన్ని కోల్పోయిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. ల్యాండర్ కు అసలు ఎమైంది,  అది క్రాష్ అయ్యిందా లేదా ల్యాండ్ అయిందో అనే విషయం పై సమాచారం  ఇంకా తెలియలేదు.



ఈ సంఘటన ఇజ్రాయెల్ చంద్రుడి పైకి పంపిన బెరెషీట్ అంతరిక్ష నౌక  క్రాష్ ల్యాండింగ్ ని పోలి ఉంది, ఇది ఏప్రిల్‌లో చంద్రుడి ఉపరితలంపైకి దిగడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని కారణాల వల్ల పేలిపోయింది. చంద్రుని ఉపరితలం నుండి 2 కిలోమీటర్ల ఎత్తు వరకు  అంతరిక్ష నౌక బాగానే ఉందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. బెంగళూరులోని మిషన్ కంట్రోల్‌లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ “ఉత్తమమైన వాటి కోసం ఆశిద్దాం" అని అన్నరు. "ల్యాండర్ నుండి గ్రౌండ్ స్టేషన్ కి  కమ్యూనికేషన్లు పోయాయి ఏమి జరిగిందో గుర్తించడానికి  అంతరిక్ష సంస్థ డేటాను విశ్లేషిస్తోంది " అని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ కె శివన్ అన్నారు.



విజయవంతమైన ల్యాండింగ్  జరిగి ఉంటే  భారతదేశాన్ని చంద్రుడి ఉపరితలంపై నౌకను దింపిన నాల్గవ దేశంగా, అక్కడ రోబోటిక్ రోవర్‌ను నడిపే మూడవ దేశంగా నిలిచేది. చంద్రయాన్ -2  శాశ్వతంగా నీడతో ఉన్న చంద్రుని క్రేటర్లను అధ్యయనం చేయడానికి రూపొందించారు, ఇక్కడ 2008 లో చంద్రయాన్ -1 మిషన్ ద్వారా ధృవీకరించబడిన నీటి నిక్షేపాలను కలిగి ఉన్నాయని భావిస్తున్నారు.



స్పేస్‌ఐఎల్ (ఇస్రాయేల్) తన బెరెషీట్ ల్యాండర్‌ను 22 ఫిబ్రవరి 2019 న 01:45 UTC వద్ద విజయవంతంగా లాంచ్ చేసింది. ఇది 4 ఏప్రిల్ 2019 న 14:18 UTC వద్ద చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. 11 ఏప్రిల్ 2019 న, ల్యాండింగ్ సమయంలో చివరి నిమిషాల్లో గైరోస్కోప్ పనిచేయక పోవడం‌వల్ల సమస్య సంభవించింది. అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్లు పోయాయి, బ్రేకింగ్ ప్రక్రియ విఫలమయ్యి వాహనం చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది.బెరెషీట్ క్రాష్ ఈ ప్రాజెక్టుపై సంవత్సరాలుగా పనిచేసిన వందలాది మంది ఇంజనీర్ల ఆశలను దెబ్బతీసింది.



విక్రం ల్యాండర్ కి ఎమయింది అన్న విషయాన్ని  డేటాను విశ్లేషించిన తరువాత ఇస్రో ఏమని చెప్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: