సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ ట్విట్టర్ వేదిక రోజుకో ట్విట్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏ జన్మలో ఏ పాపం చేశాడో కానీ రామ్ గోపాల్ వర్మ శత్రువు అయ్యి పుట్టాడు. అయితే చంద్రబాబు అధికారం చేతిలో ఉన్నప్పుడే రామ్ గోపాల్ వర్మని ఎం చెయ్యలేక పొయ్యాడు.. ఇప్పుడు అధికారం కూడా చేతిలో లేదు అందుకే చంద్రబాబు నాయుడుపై కావాల్సినంత పగ తీర్చేసుకుంటున్నాడు వర్మ. 


గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడుకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ ఒకసారి టార్చర్ చేస్తే ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంకా విషయానికి వస్తే .. టీచర్స్ డే నుండి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు ను ఉద్ద్యేశిస్తు సంచలన ట్విట్లు పెడుతున్నాడు. నిన్నటికి నిన్న చంద్రబాబు ఏడుస్తున్న ఫోటో చూపించి నిజ జీవితంలో ఇది ఎవరి పాత్రో కనుకోండి అంటూ ట్విట్ పెట్టాడు. 


ఈరోజు ఉదయం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు లోగో పోస్టర్ విడుదల అని పెడుతూ.. ఈ చిత్రంలో ఎటువంటి వివాదం లేదు అంటూనే వివాదాన్ని సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పడు అదే మోషన్ పోస్టర్ పట్టుకొని మరో సంచలన ట్విట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేస్తూ ''రక్త చరిత్ర కి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”.'' అంటూ సంచలన ట్విట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: