Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 6:01 am IST

Menu &Sections

Search

‘రాములమ్మ’ ఆ పదవిపై కన్నేశారా…?

‘రాములమ్మ’ ఆ పదవిపై కన్నేశారా…?
‘రాములమ్మ’ ఆ పదవిపై కన్నేశారా…?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాములమ్మ.. అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్, కేటఆర్‌, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు…ఈ మధ్య అంతా ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలు లేవనెత్తుతుంటే.. రాములమ్మ మాత్రం ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.

 

తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరిగిన శిల్పాల వివాదంలో తనదైన రీతిలో స్పందించారు. ఆలయంలోని శిలలపై కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని చెక్కిన వైనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తనదైన శైలిలో మండిపడ్డ విజయ శాంతి. సార్వత్రిక ఎన్నికల ముందు సారు..కారు.. పదహారు.. సర్కారు అంటూ నినాదాన్ని అదే పనిగా వినిపించటం వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తనకు అర్థమైందని.. విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశారు.

పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాల్లో దేవతామూర్తులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బొమ్మను.. కారు గుర్తును.. టీఆర్ఎస్ సర్కారు గుర్తును చెక్కటం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతుందన్నారు. రాజ్యాలు.. రాజులు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్.. తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనల్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూసి.. వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరి గుట్టను తెలంగాణ ప్రజలు భావిస్తూ.. పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని.. అలాంటి క్షేత్రాన్ని తమ రాజకీయ ప్రచారానికి వాడుకోవటం.. ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించటం సరైనది కాదని చెప్పుకొచ్చారు. ఈ తీరుపై మఠాధిపతులు.. పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే యాదాద్రి అంశంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం కేవలం ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా విజయశాంతి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాములమ్మ.. సడన్‌గా ప్రభుత్వం తీరుపై మండిపడుతుండటం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తారంటూ వార్తలు వస్తుండగా, రేవంత్ రెడ్డికి ఇస్తే.. పార్టీ సీనియర్ల నుంచి వ్యతరేకత వస్తుందన్న వార్తలు అధిష్టానాన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే అదనుగా.. రాములమ్మ పీసీసీ పదవిపై కన్నేశారేమోనన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి, అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ పార్టీలో మహిళా మంత్రులు లేకపోవడం.. టీఆర్ఎస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రాబోయే కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు లభించబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Vijayashanthi Fires on CM KCR
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేష‌న్ ఎవరో చెప్పిన ‘గద్దలకొండ గణేష్’... పున‌ర్న‌వికి స్వీట్ వార్నింగ్‌
హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున‌!
వెజ్ ఆర్డర్ చేస్తే . నాన్ వెజ్ వచ్చింది...తిన్నాక ఏం జరిగిందో చూడండి
నెటిజన్లకు అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటి ‘సోనాక్షి సిన్హా’
23ఏళ్ల పోరాటం: కలెక్టరేట్ ముందే తన అండర్ వేర్ ను ఆరేసిన ఉపాధ్యాయుడు
బిగ్ బాస్ భారీ షాక్ .... ఇది తెలిస్తే మీరు షాక్
విజయ్ దేవరకొండను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు ఎందుకో తెలుసా..?
తేయాకును కొండచరియల్లోనే ఎందుకు పండిస్తారో తెలుసా..?
రెమ్యూనరేషన్ పెంచేసిన ముద్దుగుమ్మ
హౌస్ లో కుటుంబ సభ్యుల మధ్య ‘చిచ్చు’ పెట్టిన ‘బిగ్ బాస్’
చంద్రయాన్ -2 కథ ముగిసినట్టేనా..? ఇస్రో చేసిన ఓ భావోద్వేగ ట్వీట్ ఏం చెబుతోంది
బోటును బయటకు తీయడంలో ఆలస్యమెందుకు..?..నిపుణులు చెబుతున్నదేంటి.!
'సైరా' టికెట్ల రేట్లు పెంపు...పక్కా ప్లాన్ తో వెళ్తున్న 'సైరా' టీమ్
డిగ్రీ సిలబస్ మార్పునకు శ్రీకారం చుట్టిన ఏపీ విద్యామండలి
వావ్...'సైరా' కోసం 'నయనతార' ఇలాంటి నిర్ణయం తీసుకుందా..!
మరో భారీ కుట్రకు రెడీ అవుతున్న 'పాక్'....బట్టబయలు చేసిన నిఘా వర్గాలు
మళ్లీ లిప్‌లాక్ సీన్‌తో రికార్డ్ సృష్టించబోతున్న 'విజయ్ దేవరకొండ'
రైలులో చివ‌రి బోగి వెనుక ఆంగ్ల అక్ష‌రం 'X' ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.