ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ 100 రోజుల పాలనలో ఇప్పటికే ఎన్నిక్ల ముందు ఇచ్చిన హామీలన్నిటిని నేరవేరుస్తూ అవినీతి లేని పాలనను అందిస్తున్నడు.
అయితే రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలనే లక్ష్యంగా ముందడుగేస్తున్న జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఏపీనూతన లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని జగన్ నిర్ణయించారు. లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే అవకాశం ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


నిజాయితీ, మంచి వ్యక్తిగా పేరుండడంతో పి.లక్ష్మణ్‌రెడ్డిని ఎంపిక చేసుకునట్టు తెలిపారు. అయితే లోకాయుక్త నియామక ఫైలుపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ఆమోద ముద్ర కూడా వేసారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి గతం లో,ప్రజా చైతన్య వేదికకు అధ్యక్షుడి గా పలు మార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు, విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సందర్భాలు విదితమే.


అయితే జస్టిస్ గారిని లోకాయుక్త కీలక పదవిలో నియమించడం పై వారి అరహతానర్హతలు ఎలా ఉన్నాసరే జగన్ గారి దృష్ఠ్టి నుండి లక్ష్మణ రెడ్డి గారికి ఉన్న సామాజిక వర్గమే కాక చంద్రబాబు నాయుడు పై చేసిన ఆరోపనాపర్వం కూడా పదవి కి కట్టబెట్టేందుకు అర్హతగా తీసుకుని ఉంటారని టీడీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయట.
ఏది ఎటు ఉన్న తమ ప్రియతమ నాయకుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే సంచలన నిర్ణయాలతో వై స్ ఆర్ సి పి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ, నాయకుడిని పొగుడుతూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: