లోక్ సభ ఎన్నికల్లో విజయం తెలంగాణా బీజేపీలో కొత్త జోష్ నింపింది.  సభ్యత్వ నమోదు సక్సెస్ కావడంతో భవిష్యత్ రాజకీయాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు స్టేట్ లీడర్ షిప్ ఎంపికపై మెయిన్ ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణా బీజేపీ కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ పార్టీ సీనియర్ నేతలు గా ఉన్న దత్తాత్రేయ హిమాచల్ గవర్నర్ గా వెళ్తున్నారు. మరో సీనియర్ నేత సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. అటు లక్ష్మణ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మరో టర్మ్ ఆయనను కొనసాగిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ డిసెంబర్ తో ఆయన పదవీ కాలం ముగుస్తోంది.


దీంతో కొత్త అధ్యక్ష రేసులో పలువురు నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్ రావ్ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఈయన హైకమాండ్ తో ఫుల్ టచ్ లో ఉన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల ఇంచార్జ్ గా పని చేసిన అనుభవం ఉంది. అయితే సామాజిక వర్గాల సమీకరణాలు ఈయనకు కలిసొస్తాయా లేదా అనేది చూడాలి. మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఢిల్లీ లెవల్లో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.


ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తో పాటు పార్టీలో సీనియర్ నేతల అండ ఈయనకున్నట్టు తెలుస్తోంది. టిఆర్ ఎస్ తో ఢీ అంటే ఢీ అని పోరాడేందుకు ఈయనే కరెక్ట్ అనే వాదన పార్టీలో వినిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీ నారాయణ పేరు మొదట్లో వినిపించింది. కానీ, ఆయన కేంద్ర నాయకత్వం ఆదేశాలతో రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రఘునందన్ రావ్ తో పాటు ఎస్సీ కోటాలో చింతా సాంబమూర్తి తనకు ఓ అవకాశమివ్వాలని కోరుతున్నారట.


పార్టీలో కొత్తగా చేరిన వారు కూడా తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని విన్నపాలు పెట్టారట. మాజీ మంత్రి డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట. అయితే రాష్ట్ర నాయకత్వాన్ని మారిస్తే లక్ష్మణ్ ను ఎలా బుజ్జగిస్తారన్నది ఓ పాయింట్.  బీజేపీ అంటే గుర్తుకొచ్చేది దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈ ముగ్గురిలో దత్తాత్రేయ గవర్నర్ అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. మరి లక్ష్మణ్ కు ఏ పదవిని ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అద్యక్షుణ్ణి మార్చాలని భావిస్తే లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు ఇచ్చి పార్టీ బాధ్యతలు కొత్తవారు చేతిలో పెడతారని తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: