ఎప్పటికప్పుడు ధరలు పెరిగి ప్రజలను తెగ టెన్షన్ పెట్టేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి కేవలం బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలే. ఒకరోజు పెరిగితే మరొకరోజు తగ్గుతుంది. హా ఈరోజు తగ్గింది కదా అని అనుకుంటే చాలు రాత్రికి రాత్రి ధరలు పెరిగిపోతాయి. రెండు నెలల క్రితం వరుకు 80 రూపాయలపై ఉన్న పెట్రోల్, డీజీల్ ధరలు ఇప్పుడు భారీగా దిగి వచ్చాయి.                    


పైసల్ రూపంలో రోజుకో పైసా చొప్పున ఇప్పటివరకు దాదాపు 10 రూపాయలు తగ్గినట్టు చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయితే 80 రూపాయిలపై ఉన్న పెట్రోల్ ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 76 ఉంది. డీజల్ ధర 71 రూపాయిలు ఉంది. అయితే ఇదే రోజు దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 71. 95గా ఉంటె, డీజల్ ధర 65 రూపాయలుగా ఉంది.                      

 

ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.77.62గా ఉండగా, డీజిల్ ధర 68 రూపాయలుగా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం కాస్త బలపడటంతో చమురు ధరలు తగ్గు ముఖం పడుతోన్నాయి. కానీ పసిడి ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. అయితే గత సంవత్సరం ఇదే రోజు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయిలు ఉండగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 87 ఉంది. ఇప్పుడు మాత్రం పైసల ప్రకారం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది పెట్రోల్ ధరలు. బంగారం మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా ఉరకలు వేస్తూ స్పీడ్ బ్రేకులు వద్ద చిన్న బ్రేక్ వేసి మళ్ళి అదే రేంజ్ లో ఫాస్ట్ గా పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికి పెట్రోల్, డీజల్ వినియోగదారులకు ఇది శుభవార్తే. 


మరింత సమాచారం తెలుసుకోండి: