దేవినేని ఉమా...కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే నేత. జిల్లా తెలుగుదేశంలో తానే నెంబర్ 1 అనుకునే నాయకుడు. అధికారంలో ఉంటే తిరుగులేని నేతగా వ్యవహరిస్తుంటారు. అలాంటి నేత అడ్రెస్ ఇప్పుడు గల్లంతు కానుందా? అధికారంలో ఉన్నప్పుడూ మొత్తం జిల్లా నేతలని తన వెనుక తిప్పుకున్న ఉమా పని ఇప్పుడైపోయిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుత పార్టీలో ఉమా పరిస్తితి దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయనని మిగతా నేతలు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తోంది.


వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా ఈ సారి ఓడిపోవడంతో ఎవరు లెక్క చేయనట్టు అనిపిస్తోంది. అయితే ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఉమా చక్రం తిప్పేవారు. కానీ ఇప్పుడు ఆయన ఓడిపోవడం, పార్టీ కూడా ఓడిపోవడంతో ఉమా స్థాయి తగ్గినట్లుంది. ఒకప్పుడు జిల్లాలో ఉమాకి మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడంలేదు. సొంత నియోజకవర్గం మైలవరంలో కూడా ఉమా క్రేజ్ తగ్గిపోయినట్లుంది.


కాకపోతే ఉమా తన ఉనికి కాపాడుకోవడానికి అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అధికార వైసీపీపై విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. ఈ మీడియా సమావేశాల్లో కూడా ఉమా వెనుక అంతకముందు వచ్చినట్లు నేతలు రావట్లేదు.  అయితే ఇంతకాలం ఉమా జిల్లాలో పెత్తనం చెలాయించడం వల్లే ఆయన్ని మిగతా నేతలు పట్టించుకోవట్లేదు. పైగా ఉమాకు జిల్లాలోని కొందరి నేతలతో పడదు. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నానిలకు ఉమా అంటే మంట.


ఉమా ఓడిపోవడం వీరు గెలవడంతో పరిస్థితులు మారిపోయాయి. వీళ్ళు ఉమాని అసలు లెక్క చేయట్లేదు. అలాగే జిల్లాలో కొందరు నేతలు కూడా ఉమాని పూచిక పుల్ల తీసేసినట్లు తీసేస్తున్నారు. మొత్తానికి మొన్నటివరకు జిల్లాలో చక్రం తిప్పిన ఉమా పరిస్తితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఏది ఏమైనా మునుపటిలా ఉమాకు పవర్ లేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: