గులాబీ దళంలో ఈటెలు రేపిన మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఈటెలకు తోడు రసమయి బాలకిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత దుమారాన్ని రేపుతున్నాయి." మా రాజేంద్రన్న నాకేమో ఒక్కొక్కసారి వాస్థవాలు మాట్లాడుకోకుంటే పొట్ట ఊరుకోదు ఇవతలకి రా అంటది. ఎందుకంటే మేమంతా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము. వాస్తవాల మీద ఉద్యమాలు నడిపిన వాళ్ళము మేము. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలని కలలు కన్న వాళ్ళము.



సమాజాన్ని చైతన్య పరిచిన వాళ్ళము వాస్తవంగా. ఒక్కొకసారి బాధనిపించింది, చాలా బాధనిపించింది". అని రసమయి కిషన్ అన్నారు. ఈటెల మాటలపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు కూడా ఇన్ డైరెక్ట్ గా తప్పు పట్టారు . అయితే ఇప్పుడు రసమయి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పార్టీ నేతలు తికమక పడుతున్నారు . అయితే రసమయి కామెంట్స్ పై గులాబీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది . రసమయి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు, వారు ఉద్దేశమేంటి అనే విషయాల పై ఆరా తీస్తున్నట్టు సమాచారం .



అప్పటికప్పుడు ఫ్లోలో అన్న మాటలా లేక కావాలనే ఈటలకు మద్దతు పలికేందుకు కామెంట్స్ చేశారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారట . అంతేకాదు పార్టీలో అంతర్గతంగా ఈటెలపై సానుభూతి వ్యక్తమవుతోందా . ఆయనకు మద్దతుగా ఇంకా కొంత మంది నేతలు మాట్లాడే అవకాశముందా లాంటి విషయాల పై కూడా పార్టీ పెద్దలు నిఘా పెట్టినట్లు సమాచారం . మరోవైపు కేసీఆర్ తో కానీ, కేటీఆర్ తో గానీ ఈటెలను పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు . దీంతో ఈ వ్యవహారం ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో అన్న చర్చ పార్టీలో జరుగుతోంది .




మరింత సమాచారం తెలుసుకోండి: