ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో అడుగులు వేస్తూ ఇటీవల స్పందన కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పందన కార్యక్రమంలో భాగంగా చాలామంది ప్రజలు రత్న రెడ్డి అనే వడ్డీ వ్యాపారి వేధింపులపై పోలీసుల ముందు వాపోయారు.                                                               


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు గుంటూరులోని కొత్తపేటలో రత్నారెడ్డిని అరెస్ట్ చేశారు. నూతలపాటి సుధాకర్ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు రత్న రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రత్న రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని కార్యాలయంలో దాదాపు 225 ఏటీఎం కార్డులు, 


రూ.1.40 లక్షల నగదు దొరికింది. దీంతో ఆ నగదుని అంత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 పాస్ పుస్తకాలు, 102 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 ఖాళీ చెక్కులు, 8 పట్టాదారు పాస్ పుస్తకాలు, 20 దస్తావేజులు రత్నారెడ్డి ఆఫీసులో లభించాయి. అయితే ఆంధ్రలో కాల్ మని వడ్డీ వ్యాపారుల వేధింపూలు మరిచిపోకముందే ఈ అధిక వడ్డీ వ్యాపారం ఘటన వెలుగులోకి వచ్చింది.                                                                                              


మరింత సమాచారం తెలుసుకోండి: