సల్మాన్ ఖాన్ కి ముస్లిం లలోనే కాకుండా హిందువుల్లో కూడా ఫాన్స్ ఉంటారు. కావున తమ సంప్రదాయాలను సల్మాన్ ఖాన్ ఎప్పుడు కించపరిచే విధంగా వ్యవహరించలేదు అని కానీ ఈసారి గణేష్ పండుగల్లో సిగరెట్ తాగుతూ కనిపించడం వల్ల తాము ఎంతో మనస్తాపానికి చెందాను అని పేర్కొన్నారు.

సినిమాలలో తమ అభిమాన హీరోలు ఏది చేసినా పర్వాలేదు కానీ బయట వారు ప్రవర్తించే తీరు పై ఏదైనా తప్పు కనిపిస్తే ఫాన్స్ తీవ్రంగా బాధ పడతారు. వెంటనే అభిమాన హీరోకి లేదా హీరోయిన్కి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అభిమానులు లేకపోతే వారి ఉనికికి ప్రమాదం ఉంది అని తెలిసిన వారు వెంటనే జాగ్రత్తపడి క్షమాపణలు చెప్పడం మరలా ఇది చేయబోవు అని పేర్కొనడం ఇకపై నుండి జాగ్రత్తగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు.

కానీ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అటువంటి క్షమాపణలు చెప్పిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి ఏది చేసినా నా ఇష్టం మేరకు చేశాను అని అది తప్పు అనిపిస్తే అసలు నేను చేయను అని, ఇందులో నాకు ఎటువంటి తప్పు అసలు కనిపించనేలేదు అని వాదించడం సల్మాన్ ఖాన్ కి చాలా అలవాటు. ఇతనిపై ఎన్ని కేసులు అంతకుముందు వచ్చినా కూడా వారి అభిమానుల కారణంగానే జైలుపాలు కాలేదు అన్న విషయాన్ని సల్మాన్ఖాన్ ఎప్పటికప్పుడు మరచిపోతూ వుంటాడు.

ఒక ముస్లిం వ్యక్తి తండ్రి అయినప్పటికీ సల్మాన్ ఖాన్ తల్లి ఒక హిందువు. అందుకే వీరు హిందూ సంప్రదాయాన్ని కూడా అంతే గౌరవించడం వారికి చిన్నప్పట్నుంచి అలవాటు. కానీ హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సంబరాల్లో ఇలా సిగరెట్ తాగుతూ కనిపించడం అనేది చాలా మంది హిందూ ఫాన్స్ కి మనస్థాపం కలిగించిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: