ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ సమస్యను మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత, దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తరువాత జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో కలిసిపోయింది. జమ్మూ కాశ్మీర్ కి అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం గా విభజించారు. ఈ నిర్ణయం పట్ల భారతదేశ పౌరులు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 


అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీరులో పరిస్థితులు ఎలా వున్నాయి. సామాన్యస్థితికి వచ్చాయా లేదంటే ఎక్కడైనా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయా.?  వివరాల్లోకి వెళ్ళితే భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ  నిర్ణయం తరువాత పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ  సందర్భంలో సాక్ష్యాత్తు ఆ దేశ రాష్ట్రపతి  భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే జిహాద్ ఒక్కటే మార్గమని ఉద్ఘాటించారు. ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉంది ఈ వ్యాఖ్యలు చేయడం కుటిల బుద్ధికి నిదర్శనం అని  ఘాటుగా సమాధానం ఇచ్చారు నెటిజనులు.


అయితే అవకాశం వచ్చినప్పుడల్లా ఇండియాను ఎలాగైనా నాశనం చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నారు.అందులో భాగంగా  కాశ్మీరులో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దేశంలో చొరబడడానికి 230 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీరులో సిద్ధంగా ఉన్నారు.వీరిలో కొందరు ఇబ్బందులు సృష్టించటానికి తయారుగా ఉన్నారు. 


ఈ అంశం పై  జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ స్పందించారు.. పాక్‌ ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.  ఏది ఏమైనప్పటికీ ఆంక్షలను క్రమంగా సడలించామని, కశ్మీర్, జమ్మూ, లడఖ్‌లోని మొత్తం 199 పోలీస్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మాత్రమే ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మూడు ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ సేవలను పూర్తిగా పునరుద్ధరించామని తెలిపారు. ఏమైనా  అలజడులకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అయన హెచ్చరించారు.  జమ్మూ కాశ్మీర్ లో అలజడులు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా చట్టబద్ధంగానే జమ్మూ కాశ్మీర్ కు చెందిన కీలక నేతలను గృహనిర్బంధం చేసినట్టు అజిత్ దోవల్ పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: