ఇయర్ ఎండింగ్ లో జరిగే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు ఆ సంవత్సరం చదివిన అంశాలపై ఉండాలి తప్పించి జనరల్ గా అడిగితె పిల్లలు ఎలా రాయగలుగుతారు.  అది చాలా కష్టమైన అంశం అవుతుంది.  పెద్దవాళ్ళ పరీక్షలకు ఎలాంటి ప్రశ్నలు అడిగినా బాగానే ఉంటుంది.  కానీ, కొన్ని ప్రశ్నలు అడగకూడని విధంగా అడిగే పిల్లలో తెలియని ఓ భావన కలుగుతుంది.  


ఇతరులపై అనాసక్తిని పెంచుకుంటారు.  అలాంటి అనాసక్తిని పెంచుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి. సమాజంలో ఉత్తర పౌరులుగా మారాల్సిన పిల్లలు మరొకరిపై ద్వేషాన్ని పెంచుకుంటారు.  పక్కన ఉండే వ్యక్తిని ప్రేమతో కాకుండా ద్వేషంతో చూస్తాడు. ఒక మనిషి సమాజంలో ఎలా ఉన్నాడు అన్నది.. ఆ పిల్లవాడు పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.  అందుకే చాలామంది పిల్లలు పెద్దయ్యాక క్రూరంగా కనిపిస్తుంటారు.  కొంతమంది అభద్రతా భావంతో కనిపిస్తుంటారు.  


చదువు చెప్పేసమయంలో, విద్యార్థులకు రాసే పరీక్షల్లోని ప్రశ్నపత్రాలను పట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది.  ఇటీవలే ఆరో తరగతి చదువుకునే పిల్లలకు సెంట్రిల్ సిలబస్ ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలు అందరికి షాక్ ఇస్తున్నాయి.  అందులో దళితులు అంటే ఎవరు అని అడిగారు.  ఈ ప్రశ్న అడగడం ఎంతవరకు కరెక్ట్ అని డీఎంకే అధినేత స్టాలింగ్ ప్రశ్నించారు.  చిన్నతనం నుంచి దళితుడు అంటే ఎవరు అని పిల్లలకు నూరిపోస్తే... ఆ పిల్లలు ఎలా తయారవుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు.  దళితుడు ఇలా ఉంటాడు అని వాళ్లకు తెలిస్తే.. వారి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి.  


దీంతో పాటుగా ముస్లింలకు  సంబంధించిన సాధారణ అంశం ఏంటి అనే ప్రశ్న కూడా అడిగారట.  ఈ ప్రశ్నను అడగటం వలన ఎన్ని నష్టాలు వస్తాయో తెలిసిందే.  ఇప్పటికే హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఏ మాత్రం చిన్న రగడ ప్రారంభమైన అది చిలికి చిలికి గాలివానలా మారి తారా స్థాయికి చేరుకుంటోంది.  ఈ గొడవల్లో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతుంటారు.  జీవితాలు నాశనం అవుతుంటాయి.  అలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడగటం వలన జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలిసిందే.  ఇప్పటికైనా ఇకపై ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటె బాగుంటుంది కదా.  అయితే, కేంద్రీయ విద్యాసంస్థ మాత్రం అలంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: