ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ .. టీడీపీర్ రెండు ఒకటేనని వైసీపీ ప్రధానంగా ఆరోపించింది. ఎన్నికల ముందు విడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని పవన్ ను జగన్ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ శైలి కూడా జనాల్లో జనసేనకు టీడీపీకి మధ్య బంధం ఉందని నమ్మారు. ఎన్నికల్లో జనసేన ఓటమికి ప్రధాన కారణం కూడా అదే. అయితే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మనిషేనని పవన్ కల్యాణే నిరూపిస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పదించి టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది.

ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి. జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి.


అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. పవన్ కళ్యాణ్ ఎన్నికలో ఓడిపోవడానికి మరొక కారణం ..  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్లో స్పందించడం .. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి రావటం .. పోవటం చేస్తుండటంతో జనాలు పూర్తిగా జనసేనను విశ్వసించే పరిస్థితి రాలేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ  ... వైసీపీ ముందు జనసేన నిలవలేక పోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: