భారతదేశంలో అస్సాం భూభాగం నార్త్ ఈస్ట్ కు చెందినది. అక్కడ అక్కడి భూభాగం చుట్టూ చైనా మరొకపక్క బంగ్లాదేశ్ ఇంకొక పక్క నేపాల్ మరియు మైనర్ ఇలా విస్తరించి ఉంటాయి కావున ఏనాటినుంచో చైనా నుంచి పాకిస్తాన్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉన్నందున అక్కడ వాతావరణం చల్లగా ఉండటం లేదు. సంఘ విద్రోహ శక్తులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అస్సాంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

భద్రత రీత్యా అసలు ఎవరు బంగ్లాదేశీయులు ఎవరు భారతదేశం లో అని కనుగొనడానికి ఏరివేత ను తాజాగా కేంద్రం ప్రారంభించింది దీంట్లో ఎన్నో లక్షల మందికి వారి డాక్యుమెంట్లు సరిగా లేనందున ఎం ఆర్ సీలు అందలేదు మేమంతా భారతీయులం అని వారు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినడం లేదు. మరొకపక్క పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో భారత దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తులను మేల్కొలిపే ప్రయత్నం చేస్తోంది ఇలాంటి సమయంలో అస్సాంలో నెలకొన్న వాతావరణం మంచిది కాదు అని దీని కోసం సెక్యూరిటీ ఇంకా పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.

ఎక్కడైనా ఎవరినైనా ఎప్పుడైనా అనుమానం వస్తే వెంటనే అరెస్టు చేసే ఒక పద్ధతిని ఒక శక్తిని పోలీసులకు అక్కడ ఇవ్వడం జరిగింది కేంద్రం. కానీ దానిని రద్దు చేయాలా లేదు అంటే పొడిగించాలా అన్న విషయంపై చర్చలు జరిగాయి. అస్సాంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దీనిని పొడిగించడం మంచిదని ఆగస్టు 28 2019 నుంచి మొదలయి మరొక ఆరు నెలలు దీనిని కంటిన్యూ చేయాలి అని కేంద్రం తీర్మానించింది.

పూర్తి పరిశీలన చేసిన తర్వాత మొత్తం అస్సాం రాష్ట్రం అంతా డిస్టర్బ్ ఏరియా అనగా బాగా అల్లకల్లోలంగా ఉన్న ఒక రాష్ట్రం అనే బిరుదు ఇచ్చింది. ఇటువంటి బిరుదు పొందిన రాష్ట్రంలో భద్రతా శక్తులు అధికంగా పెంచి వాటిని ఆరునెలలు లేదా ఏడాదిపాటు గమనించి ఆ తర్వాత అంతా సురక్షితంగా ఉంది అంటే ఆర్మీ ని తిరిగి వెనక్కు పంపుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: