సెప్టెంబర్ 7 వ తేదీ అర్ధరాత్రి ఎంతటి ఉత్కంఠత ఉన్నదో అలాంటి ఉత్కంఠత ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది.  ఆర్బిటర్ నుంచి భూమికి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.  కానీ, విక్రమ్ నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు అందటం లేదు.  అయితే, విక్రమ్ సేఫ్ గానే ఉంది ఉంటుంది అనే ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు.  ఎలాంటి పరిస్థితుల్లో కూడా విక్రమ్ డ్యామేజ్ అయ్యి ఉండదని, డేటా కూడా ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు.  


2.1 కిలోమీటర్ల దూరం నుంచి ల్యాండర్ విక్రమ్ తో సంబంధాలు తెగిపోయాయి.  అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే విక్రమ్ తో సంబంధాలు తెగిపోయాయని, దానికి సంబంధించిన సమాచారం త్వరలోనే వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ప్రయోగం విఫలం అయిందని అనుకోవడం లేదని అంటున్నారు.  


విక్రమ్ జాడ కోసం ఆర్బిటర్ ప్రయత్నం చేస్తుందని, చంద్రుని ఉపరితలం నుంచి పోటోలను పంపుతూనే శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఆర్బిటర్ చంద్రుని ఫోటోలను భూమికి పంపింది.  ఆ ఫోటోలను విశ్లేషిస్తున్నారు.  ఫొటోల్లో ఎక్కడైనా ల్యాండర్ జాడ దొరుకుతుందేమో అని నిశితంగా గమనిస్తున్నారు.  ఒకవేళ వాతావరణం అనుకూలించి ల్యాండర్ తిరిగి తనను తాను కంట్రోల్ చేసుకొని ఆర్బిటర్ కు సంకేతాలు పంపితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  ల్యాండర్ పై ఇంకా నమ్మకం ఉందని మన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  


మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టింది ఇస్రో.  చంద్రయాన్ ను లో వైఫల్యాలను రివ్యూ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధం అవుతున్నారు.  చంద్రయాన్ 2 ను మరలా ప్రయోగిస్తారు లేదంటే దానికి కొనసాగింపుగా చంద్రయాన్ 3 ని కొనసాగిస్తారా చూడాలి.  ల్యాండర్ కు ఇంకా 13 రోజుల సమయం ఉన్నది.  ఈలోపు ఏదైనా అద్భుతం జరిగి ల్యాండర్ సేఫ్ అని తెలిస్తే.. రోవర్ బయటకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తుంది.  అలా జరిగితే నిజంగా అద్భుతం అని చెప్పాలి.  ఎలా జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: